ప్రముఖ దర్శకుడు మణిరత్నం నుంచి రానున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1’. ఇటీవలే ఈ సినిమా విడుదలకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పుదుచ్చేరిలో జరుగుతోంది. ఇందులో విక్రమ్, కార్తి, ఐశ్యర్యరాయ్, త్రిష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చోళ రాజుల కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా సెట్లోకి ఐశ్వర్యరాయ్ అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆమె నందిని, మందాకిని అనే పాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం. 2022లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
మణిరత్నం కోసం మందాకినిగా…
Related tags :