Business

భారీగా పసిడి ధర పతనం-వాణిజ్యం

భారీగా పసిడి ధర పతనం-వాణిజ్యం

* హైదారాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.44,550 (గురువారం రూ. 44,900 ) గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,600 (గురువారం రూ. 48,980) వద్ద నమోదైంది.విజయవాడలో 22 క్యారెట్ల తులం గోల్డ్‌ ధర రూ. 44,550 (గురువారం రూ. 44,900 ) కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,600 గా (గురువారం రూ. 48,980 ) ఉంది.విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,550 (గురువారం రూ. 44,900 ) వద్ద ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,600 (గురువారం రూ. 48,980 ) వద్ద కొనసాగుతోంది.

* టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభం రోజే భారత స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో తన ట్రేడింగ్‌ ప్రస్థానాన్ని ఆరంభించిన జొమాటో మొత్తానికి ఛాంపియన్‌ అనిపించుకుంది. ఒలింపిక్స్ లక్ష్యం సూచిస్తున్నట్లుగా.. తొలి రోజు జొమాటో షేరు కదలిక ‘వేగంగా, బలంగా, ఉన్నతంగా’ (ఫాస్టర్‌, స్ట్రాంగర్‌, హయ్యర్‌) సాగింది. లక్షల మంది మదుపర్ల ఆశల్ని కూడగట్టుకొని భారత స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైన తొలి యూనికార్న్‌గా చరిత్ర సృష్టించింది. గత కొన్ని నెలలుగా ఊరించిన జొమాటో ఐపీఓ.. అందరూ ఊహించినట్లుగానే మదుపర్లకు తొలిరోజు మంచి రుచి చూపించింది. ఐపీఓ ధర రూ.76కు 51.32 శాతం ప్రీమియంతో బీఎస్‌ఈలో రూ.115 వద్ద.. ఎన్‌ఎస్‌ఈలో 52.63 శాతం ప్రీమియంతో రూ.116 వద్ద జొమాటో ట్రేడింగ్‌కు శ్రీకారం చుట్టింది. 10:08 గంటల సమయంలో 82.17 శాతం ప్రీమియంతో రూ.138.90 వద్ద జొమాటో షేరు ధర అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. దీంతో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.లక్ష కోట్లు దాటి రూ.1,08,067.35కు చేరింది. అప్పర్‌ సర్క్యూట్‌ వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో కొద్దిసేపటికి 115 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరింది. ఆపై ట్రేడింగ్‌ ముగిసే వరకు షేరు 120-130 మధ్య స్థిరంగా కదలాడింది. చివరకు 65.79 శాతం లాభంతో 126 వద్ద స్థిరపడింది. దీంతో మార్కెట్‌ విలువ రూ.98 వేల కోట్లకు చేరింది. ఇలా ఈరోజు జొమాటో షేరు రూ.115-138.90 మధ్య కదలాడింది.

* మీరు వేత‌నం, పెన్ష‌న్‌, ఈఎంఐ పేమెంట్ వంటి ముఖ్య‌మైన బ్యాంకింగ్ లావాదేవీల కోసం వ‌ర్కింగ్ డే కోసం వేచి చూడాల్సిన అవ‌స‌రం లేదు. ఇందుకోసం భార‌తీయ రిజ‌ర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తాజాగా నేష‌న‌ల్ ఆటోమేటెడ్ క్లియ‌రింగ్ హౌస్ (నాచ్‌) నిబంధ‌న‌ల‌ను మార్చేసింది. స‌వ‌రించిన ఈ నిబంధ‌నలు ఆగ‌స్టు ఒక‌టో తేదీ నుంచి అమ‌లులోకి రానున్నాయి.

* క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్తి కావొస్తుండ‌టంతో సిబ్బందికి ఇచ్చిన వ‌ర్క్ ఫ్రం హోం ఫెసిలిటీని ఐటీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్ ఎత్తేసింది. ఈ మేర‌కు త‌మ సిబ్బందికి గత వారం మెమో పంపిన‌ట్లు వార్త‌లొచ్చాయి. దీంతో 190 బిలియ‌న్ డాల‌ర్ల ట‌ర్నోవ‌ర్ గ‌ల ఇన్ఫోసిస్ తిరిగి ట్రాక్‌లోకి వ‌చ్చేందుకు రంగం సిద్ధ‌మైంది.