* జాతీయరహదారిపై ఢీకొన్న 2 కార్లు.. 8 మంది మృతి.నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం, 8 మంది మృతి.హైదరాబాద్-శ్రీశైలం జాతీయరహదారిపై ఢీకొన్న 2 కార్లు.ఉప్పునుంతల మం. చెన్నారం గేట్ వద్ద ప్రమాదం.
* గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ముప్పాళ్ళలో ఉద్రిక్తత.గురువారం పదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ.కత్తిపోట్లకు గురైన ఆఫ్రిద్ మృతి.నిందితుడుని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తు మృతదేహంతో సత్తెనపల్లి నరసరావుపేట మార్గంలో ఆందోళన.భారీగా స్తభించిన ట్రాఫిక్.
* జగన్ అక్రమాస్తుల కేసుల్లో విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. మొదట ఈడీ కేసులు విచారించాలన్న ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. మొదట సీబీఐ కేసులు లేదా రెండూ ఒకేసారి విచారించాలన్నారు. అయితే, సీబీఐ, ఈడీ కేసులు వేర్వేరని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) సూర్యకరణ్ రెడ్డి వాదనలు వినిపించారు. మనీలాండరింగ్ చట్టాన్ని 2019లో సవరించారని, ఈ అభియోగాలపై విచారణ జరపాలని వాదించారు. ప్రధాన కేసుతో సంబంధం లేకుండా ఈడీ ఛార్జిషీట్లపై విచారణ చేపట్టాలన్నారు. దీంతో ఇరువర్గాల వాదనలు విని న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
* ఏపీలో ఇద్దరు ఐఏఎస్ లపై హైకోర్టు అరెస్ట్ వారెంట్-కోర్టు ధిక్కారంపై ఆగ్రహం.ఏపీ ప్రభుత్వంలో కీలక స్ధానాల్లో ఉన్న ఇద్దరు ఐఏఎస్ అధికారులపై హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది.ఓ కోర్టు ధిక్కారం కేసులో హైకోర్టు తమ ముందు హాజరవ్వాలని ఆదేశాలు ఇచ్చినా ఒకరు చివరి నిమిషంలో మినహాయింపు కోరగా.. మరొకరు అసలు హైకోర్టు ఆదేశాలనే పట్టించుకోలేదు.దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది.రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీర్ శంకరాచార్యులుకు ప్రొవిజనల్ పెన్షన్, ఇతర భత్యాలను విడుదల చేయాలని గతంలో హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.అయితే ఈ ఉత్తర్వులను అధఇకారులు అమలు చేయకపోవడంతో ఆయన ఈ ఏడాది ఏప్రిల్లో హైకోర్టులో ఐఏఎస్ అధికారులు గోపాల కృష్ణ ద్వివేదీ, అనంతరాముపై కోర్టు ధిక్కార కేసు వేశారు.
* మహా విషాదం- కొండచరియలు విరిగిపడి 36 మంది మృతి.మహారాష్ట్ర, రాయ్‌గఢ్ జిల్లాలోని మహద్ తలై గ్రామంలో కొండచరియలు విరిగి పడ్డ ఘటనలో 36 మంది మృతిచెందారు.అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.వారిని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు.