* దేశరాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్ ఆస్పత్రిలో తాజాగా ఓ అరుదైన శస్త్రచికిత్స జరిగింది.మెదడులో కణితిని తొలగించేందుకు వైద్యులు ఓ యువతిని మెలకువగా ఉంచి ఆపరేషన్ నిర్వహించారు.ఈ సందర్భంగా యువతి నిద్రలోకి జారిపోకుండా ఉండేందుకు హనుమాన్ చాలీసాను పఠించారు.ఆమె 40 శ్లోకాలను చదువుతుండగా తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డా. దీపక్ గుప్తా నేతృత్వంలోని వైద్యుల బృందం జులై 23న ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం యువతి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
* పది, పన్నెండో తరగతి ఫలితాలను శనివారం 3 గంటలకు విడుదల చేసింది కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) బోర్డు.
* కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తున్న కొవిడ్ ఆంక్షలను రేపటినుంచి సడలించాలని సర్కారు నిర్ణయించింది.
* రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 16 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతులు నిలిపివేసింది.ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో లక్షా 39 వేల సీట్లకు ఆమోదం తెలిపింది.గతేడాది 274 కళాశాలలకు అనుమతలివ్వగా ఈసారి 258 విద్యాసంస్థలకు మాత్రమే ఆమోదం తెలిపింది.కృత్రిమ మేథ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి తొమ్మిది కొత్త కోర్సుల్లో ఈ ఏడాది 6వేల 660 సీట్లు పెరిగాయి.కొన్ని కళాశాలలు కొత్త కోర్సులకు దరఖాస్తు చేయడంతో అనుమతులు లభించాయి.కొన్ని ప్రైవేటు కళాశాలలకు అనుమతులు నిలిపివేయడంతో సీట్ల సంఖ్య తగ్గింది.ఏఐసీటీఈ ఆమోదించిన జాబితా ప్రకారం అత్యధికంగా గుంటూరు జిల్లాలో 21వేల 435 సీట్లు ఉండగా, శ్రీకాకుళంలో అత్యల్పంగా 2వేల 940 సీట్లు ఉన్నాయి.
* పురపాలికల్లో రెండో డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.
* రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు కౌలు మొత్తాన్ని ఏమాత్రం ఆలస్యం లేకుండా చెల్లించాలని భాజాపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు కోరారు.
* రాష్ట్రానికి మరో 3.72 లక్షల కొవిడ్ టీకా డోసులు వచ్చాయి.
* ఒలింపిక్స్ లో బోణీ కొట్టిన భారత్.టోక్యో ఒలనంపిక్స్ లో భారత్ కు తొలి పతకం.వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను కు సిల్వర్ మెడల్.మహిళల 49 కిలోల వెయిట్లిఫ్టింగ్ విభాగం మెడల్ సంపాదించుకున్న మీరాబాయి.
* తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో శనివారం దాతల కౌంటర్‌ను టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ చేశారు.దాతలు ఇక్కడ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలు సమర్పించేందుకు వీలుగా యూనియన్ బ్యాంక్ సౌజన్యంతో కౌంటర్ ఏర్పాటు చేశారు. భక్తులు రూ.100/- నుండి విరాళాలు అందించవచ్చు.ఈ కార్యక్రమంలో అన్నదానం డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, క్యాటరింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్.శాస్త్రి, యూనియన్ బ్యాంకు ఎజిఎం శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
* కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగాలు కావాలన్న ఉద్యమ ఆకాంక్షకు తూట్లు పొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ తెలంగాణ భవన్ లో ఉత్తరాది వారినే ఎక్కువగా నియమించారని, తెలంగాణ వారిపట్ల వివక్ష చూపిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ భవన్ ముందు నిన్న విద్యార్థులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. దానిపైనే స్పందిస్తూ రేవంత్ ట్వీట్ చేశారు. ‘‘మన ఉద్యోగాలు మనకు కావాలన్న ఉద్యమ ఆకాంక్షలకు టీఆర్ ఎస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. కేసీఆర్ పాలనలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్యాయం ఎన్నో రెట్లు ఎక్కువైంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో తెలంగాణ బిడ్డలకు ఎదురవుతున్న వివక్షే అందుకు నిదర్శనం. ఈ ఆందోళనలన్నీ తుది దశ ఉద్యమానికి సంకేతాలు. సిద్ధంగా ఉండు కేసీఆర్’’ అంటూ ఆయన హెచ్చరించారు.
* తెలంగాణ మంత్రి కేటీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూనే ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు వైఎస్ షర్మిల. వనపర్తి పట్టణానికి చెందిన లావణ్య అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని, తన చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదనే చనిపోతున్నట్టు ఆమె చనిపోయే ముందు తీసుకున్న వీడియోలో చెప్పిందని ఆమె పేర్కొన్నారు. ‘కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో పాటు.. నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపే హృదయాన్ని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలను భర్తీ చేసే పట్టుదలను ఇవ్వాలి’ అని షర్మిల ట్వీట్ చేశారు. ’54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని, విద్యార్థులకు పూర్తి ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ ఇచ్చే మనసుని ఇవ్వాలని కోరుకొంటున్నాను. మీ బాధ్యతను గుర్తుచేసె చిన్న వీడియో కానుక’ అని షర్మిల పేర్కొన్నారు.
* కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుట్కా, గంజాయి, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను ఓడించేదని ప్రశ్నించారు. ఈటల గెలిచిన తర్వాత డైరెక్ట్‌గా అయోధ్యకు వెళతామన్నారు. సీఎం కేసీఆర్‌కు ఈటల పాదయాత్ర నిద్ర లేకుండా చేస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు. సర్వేలను మాత్రమే కేసీఆర్ నమ్ముకున్నాడన్నారు. దళిత బంధును కేసీఆరే నిలిపేసి.. బీజేపీ మీదకు నెట్టేస్తున్నాడని విమర్శించారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతిలకు కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏది కేసీఆర్ అని నిలదీశారు. బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నడి బొడ్డున అంబేద్కర్ విగ్రహం పెడతామన్నారు.