ఓ డీల్ విషయంలో కామన్ ఫ్రెండ్ ద్వారా రాజ్ కుంద్రాను శిల్పా మొదటిసారి కలిసిందట. ఆమె నవ్వు, అందానికి తొలిచూపులోనే ఇంప్రెస్ అయిన కుంద్రా శిల్పాకు దగ్గరయ్యేందుకు చాలానే ప్రయత్నాలు చేసేవాడట. అప్పటినుంచి సందర్భం లేకున్నా ఆమెకు కాస్ట్లీ గిఫ్ట్‌లు ఇవ్వడం మొదలుపెట్టాడట. ఓసారి శిల్పాకు ఇష్టమైన కలర్ ఏంటో తెలియక ఒకే బ్రాండ్ ఉన్న ఖరీదైన మూడు బ్యాగులను వేరే వేరు రంగులతో ఆమెకు బహుమతిగా పంపించాడట. ఇది చూసి శిల్పా షాక్ అయ్యిందట. అంతేకాకుండా ఆ సమయంలో లండన్‌లోనే బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటండంతో పెళ్లి అయితే లండన్ వెళ్లడం ఇష్టం లేక ఇలాంటివి ఆపాల్సిందిగా శిల్పా కుంద్రాను కోరింది. దీంతో ఆమెను లండన్‌కు తీసుకెళ్లకుండా కుంద్రానే ముంబైలో ఓ ఇల్లు తీసుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా శిల్పా ఓ ఇంటర్వ్యూలోనూ రివీల్ చేసింది. అలా కుంద్రా తనపై చూపిస్తున్న ప్రేమకు అతనికి ఇంప్రెస్ అయినట్లు చెప్పుకొచ్చింది. ఇక వీరుద్దరు కొన్నాళ్లు డేటింగ్ అనంతరం 2009లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లికి ముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన శిల్పా.. వివాహం అనంతరం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు హంగామా-2 చిత్రం ద్వారా మరోసారి కం బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే భర్త అరెస్ట్ శిల్పాకు ఊహించని షాక్ ఇచ్చింది.
మూడు ఖరీదైన బ్యాగులు ఇచ్చాడు. శిల్పాతో పెళ్లి అయింది.
Related tags :