* తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లా మామల్లపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బిగ్‌బాస్ ఫేమ్ యషికా ఆనంద్ సహా ఇద్దరు గాయపడ్డారు. యషిక స్నేహితురాలైన హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వల్లిశెట్టి భవాని అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన యషికతోపాటు మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం చెన్నై తరలించారు. అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యషిక పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మద్యం మత్తులో వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం సంభవించినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బిగ్‌బాస్ షోతో ఫేమస్ అయిన యషిక మోడల్‌గానూ రాణిస్తోంది.
* విశాఖపట్నంజిల్లా పలు ప్రాంతాల నుండి విజయవాడ , హైదరాబాద్ , మహరాష్ట్రకు తరలిస్తున్న గంజాయి స్మగ్లింగ్ వ్యక్తులునుగత రాత్రి అందిన సమాచారం మేరకు అడిషనల్ ఎస్పీ మేకా సత్తిబాబు తన బృందంతో పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీలలో బాగంగా 46కేజీల గంజాయి , 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు . వారిని సదరు సెక్షన్ల మేరకు కోర్టు కు హజరుపరిచినట్లు తెలిపారు . అదే క్రమంలో ఏలూరు నుండి విజయవాడకు తరలిస్తున్న సుమారు 2 కేజీల బంగారు ఆభరణాలు పట్టుబడినట్లు , వారిని ఆత్కూరు పోలీసు అధికారులు కు అప్పగించారు అని తెలిపారు .
* కర్నూలు బిజెపి జిల్లా కార్యాలయం లో జిల్లా అధ్యక్షులు పొలం కి రామస్వామి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు లో గో రక్షకులు పై దాడులు జరగటం సిగ్గుచేటని, భారత రాజ్యాంగం లో పొందుపరిచిన చట్టాలను ఎమ్మెల్యే అవమానించడం దారుణమని ఒక వర్గానికి సంతుష్టి కారణ చేయడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని, గోవధను ప్రోత్సహిస్తూ వారికి మద్దతు తెలుపుతున్న చెన్నకేశవ రెడ్డి పై హైకోర్టును ఆశ్రయిస్తామని జిల్లా అధ్యక్షులు రామస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా ప్రతినిధి కపిలేశ్వరయ్య మాట్లాడుతూ ఎమ్మిగనూరులో జరిగిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేపడుతూ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయవలసిందిగా న్యాయస్థానం కోరుతామని హెచ్చరించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాగ్గోలు హరీష్ బాబు మాట్లాడుతూ గోవధ నిషేధ చట్టం లను న్యాయస్థానం రద్దు చేసిందని ఎమ్మెల్యే చెప్పడం ఆయనకు చట్టాలపై ఎంత అవగాహన ఉందో ప్రజలు చూస్తున్నారని తెలిపారు.
* రాయదుర్గం అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణములో బొమ్మక్కపల్లి వద్ద కర్ణాటక రామ్ పురం నుండి హనుమంతు అనే వ్యక్తి తన ఎక్ససెల్ లో కర్ణాటక మద్యం పొగుచేస్తున్న సమాచారం మేరకు అర్బన్ సీఐ ఈరన్న ఎస్ ఐ రాఘవేంద్రప్ప దాడులు చేసి పట్టుకోగా అతని వద్ద నుండి 41 బాక్సులు 3936 సాకేట్ మద్యం టెట్రా ప్యాకెట్ లు స్వాదీనం చేసుకున్నట్లు కళ్యాణదుర్గం ఇంచార్జి డి ఎస్ పి అంథోనప్ప మీడియాతో తెలిపారు.సదరు ముద్దాయిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి వెహికల్ సీజ్ చేసినట్టు తెలిపారు.అక్రమమద్యం ఎవరు తరలించిన కొరడా ఝళిపిస్తామన్నారు.