NRI-NRT

సింగపూర్‌లో బోనాల పండుగ

సింగపూర్‌లో బోనాల పండుగ

ఈ ఏడాది కూడా కరోనా నియంత్రణ నిబంధనల కారణంగా సింగపూర్ బోనాల పండుగ వేడుకలు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో 25 జులై న చాల నిరాడంబరంగా జరిగాయి . ఇక్కడి సుంగే కేడుట్ లోని శ్రీ అరస కేసరి శివన్ దేవాలయము లో సింగపూర్ ప్రభుత్వం మరియు ఆలయ నిబంధనల ప్రకారం బోనాలు సమర్పించడం జరిగింది. భౌతిక దూరం పాటిస్తూ భక్తి శ్రద్ధలతో పరిమిత సంఖ్యలో సభ్యులు బోనాలు సమర్పించారు. సమస్త ప్రజలపై ఆ మహంకాళి తల్లి ఆశిస్సులు ఉండాలని, ప్రపంచాన్ని కరోనా కోరల నుండి కాపాడాలని సభ్యులు ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు. ప్రతి ఏడాది సుమారు వేయి మంది భక్తులతో బోనాల ఊరేగింపు లో పోతరాజులు, పులి వేషాలు, తొట్టెలలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచేవి. ఈ బోనాల పండుగ ను సింగపూర్ కు ఐదేళ్ల క్రితం పరిచయం చేయడం ద్వారా TCSS పేరు చరిత్ర లో నిలిచిపోవడం సొసైటీ కి దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని మరియు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయడంలో ఇక్కడి ఏకైక తెలంగాణ సంస్థ, టీసిఎస్ఎస్ ఎప్పుడు ముందుంటూ నిర్విరామంగ కృషి చేస్తుందని కార్యవర్గ సభ్యులు అన్నారు. ఈ ఏడాది బోనం సమర్పించిన వారిలో సంస్థ ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్ కస్తూరి, గోనె నరేందర్ రెడ్డి రజిత, సంస్థాగత కార్యదర్శి గడప రమేశ్ స్వాతి మరియు వ్యవస్థాపక మరియు పూర్వ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి శ్రీదేవి దంపతులు ఉన్నారు. వీరితో పాటు సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్ మరియు ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి దంపతులు సొసైటీ తరపున ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా సునీత రెడ్డి, రోజా రమణి, గోనె రజిత జూలూరు పద్మజ మరియు కాసర్ల శ్రీనివాసరావు వ్యవరించారు.

ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, నంగునూరి వెంకట రమణ, మరియు కార్యవర్గ సభ్యులు నడికట్ల భాస్కర్, శ్రీధర్ కొల్లూరి, పెరుకు శివ రామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, ప్రవీణ్ మామిడాల, రవి కృష్ణ విజాపూర్, శివ ప్రసాద్ ఆవుల మరియు శశిధర్ రెడ్డి మొదలగు వారు అందరి పై ఉజ్జయని మహంకాళీ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియ జేశారు.