Politics

అర్ధ శతదినోత్సవం పూర్తి చేసుకున్న వివేకా హత్య దర్యాప్తు-నేరవార్తలు

అర్ధ శతదినోత్సవం పూర్తి చేసుకున్న వివేకా హత్య దర్యాప్తు-నేరవార్తలు

* ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వరుసగా 50వ రోజూ సీబీఐ విచారణ కొనసాగుతోంది.కడప నుంచి పులివెందుల వెళ్లిన సీబీఐ అధికారుల బృందం, వివేకా ఇంటిని మరోసారి పరిశీలించింది.కొత్తగా వచ్చిన సీబీఐ ఉన్నతాధికారి రామ్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారులు గంటన్నరకుపైగా ఇంటితోపాటు, పరిసరాలు గమనించారు.వివేకా ఇంట్లో ఉన్న ఆయన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డితో వారు మాట్లాడారు.హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలు, వారి దృష్టికి వచ్చిన విషయాలపై చర్చించారు.అనంతరం సీబీఐ అధికారుల బృందం పులివెందుల పట్టణంలో ఆర్ అండ్ బీ అతిథి గృహానికి వెళ్లింది.

* తొలి వాయిదాకే నిందితుడి గైర్హాజరు.బెయిల్‌ షరతు ఉల్లంఘనపై మేజిస్ట్రేట్‌ ఆగ్రహం.అరెస్టుకు రంగంలోకి దిగిన సీబీఐ.★ న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టింగ్స్‌ పెట్టిన కేసులో నిందితుడైన లింగారెడ్డి రాజశేఖరరెడ్డిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది.★ గత ఏడాది ఏపీ హైకోర్టు/సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై పలువురు ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌, వాట్సా్‌పలలో అభ్యంతరకర పోస్టింగ్స్‌ పెట్టారు.★ వారిని దూషించడమే గాక బెదిరించే ధోరణిలో పోస్టింగ్స్‌ పెట్టడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.★ దీనిపై హైకోర్టు రిజిస్ర్టార్‌ బాలకృష్ణ ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు 12 కేసులు నమోదు చేశారు.★ అయితే ఆయా కేసుల దర్యాప్తులో పురోగతి లేకపోవంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. కేసును సీబీఐకి అప్పగించింది.

* వివేకానందరెడ్డి హత్యకు ఇద్దరు వ్యక్తులు సుపారీ ఇచ్చినట్లు వాచ్‌మెన్‌ రంగయ్య చెప్పడంతో జగన్ అండ్ కో గుండెల్లో వణుకు మొదలైందని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలుగుదేశం నేతలు అభిప్రాయపడ్డారు.

* కర్నూలులో చెత్త పన్నుకు వెళ్లిన అధికారులకు చేదు అనుభవం.కర్నూలు పాత నగరంలో శనివారం చెత్తకు సంబంధించిన పన్నులను ఇంటింటికి వసూలు చేయటానికి వెళ్లిన సచివాలయ సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది.ఇంట్లో పిల్లలకు రూ.2 రూపాయలు ఇవ్వడానికే ఇబ్బందిగా ఉందని ప్రతి నెలా రూ .60 ఎలా చెల్లించాలని మహిళలు సచివాలయ సిబ్బందిని నిలదీశారు.ఈ కరోనా విపత్కర సమయంలో మూడు పూటల తినటానికే కష్టంగా ఉందని, పన్నులు ఎలా కట్టాలని ఉద్యోగులపై ఎదురుతిరిగారు. సర్దిచెప్పాలని ప్రయత్నం చేసిన అధికారులను తిరస్కరించారు.ప్రభుత్వం మీకంటే జీతాలు వస్తున్నాయి కనపడదు. పేదలు ఎలా కట్టాలని ప్రశ్నించారు.

* 14400 నెంబర్‌కు రెవిన్యూ పై ఎక్కువ శాతం ఫిర్యాదులు.ఏపీలో ఏసీబీ అధికారులకు రెవెన్యూ సిబ్బందిపై పలు జిల్లాలోని ప్రజలు ఫిర్యాదుల చేశారు.పాస్ పుస్తకాలు, ఫ్యామిలీ నెంబర్, మరణ ధ్రువీకరణ పత్రలకోసం ఎక్కువగా ఫిర్యాదులు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక తహశీల్దార్ కార్యాలయాలపై మెరుపు దాడులు చేయనున్న ఏసీబీ అధికారులు.14400 నెంబర్‌కు ఫోన్ చేసి ప్రభుత్వంలోని అవినీతి అధికారుల మీద ఎవరైనా ఫిర్యాదు చెయ్యవచ్చు.

* ఈ నెల 30 కి వాయిదా పడ్డ జగన్ బెయిల్ రద్దు పిటిషన్. CBI ప్రాసిక్యుటర్ కు ఆరోగ్యం సరిగా లేనందున సెలవులో ఉన్నారని, లిఖిత పూర్వక వాదనలు సమర్పించేందుకు మరో రెండు రోజుల గడువు కోరగా ఈ నెల 30 కి వాయిదా.

* య‌ర్ర‌వారిపాళ్యంలో గుప్త‌నిధుల క‌ల‌క‌లం. నెర‌బైలు శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌య ప్ర‌హ‌రీ గోడ ప‌క్క‌నే త‌వ్వ‌కాలు. సీసీ కెమేరాల ఆధారంగా ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు. 400 ఏళ్ల చ‌రిత్ర గ‌ల ఆల‌యానికి భ‌ద్ర‌త క‌ల్పించాలంటున్న స్థానికులు.