ఘనంగా ఆటా వాషింగ్టన్ డీసీ కాన్ఫరెన్స్ పనులు ప్రారంభం
అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఆటా, వారి అద్వర్యంలో 17వ ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ మీటింగ్ వాషింగ్టన్ డీసీ లో శనివారం ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్వహించారు. హెర్నడోన్ నగరం లో క్రౌన్ ప్లాజా హోటల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 800 మంది కి పైగా తెలుగు వారు పాల్గొన్నారు.మొ ట్ట మొదటి సారిగా ఆటా కాన్ఫరెన్స్ అమెరికా రాజధాని లో 2022 సంవత్సరంలో జులై 1,2,3 తారీకులలో వాల్టర్ యీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తారు. కాపిటల్ ఏరియా తెలుగు సంఘం కాట్స్ కో-హోస్ట్ గా వ్యవహిరిస్తోంది. శనివారం నాడు నిర్వహించిన కార్యక్రమంలో ఆటా 17వ మహా సభల థీమ్ సాంగ్ మరియు లోగో ఆవిష్కరించారు. ఆటా జాయింట్ సెక్రటరీ రామకృష్ణ ఆలా సభ కార్యక్రమాలకు అతిథుల్ని ఆహ్వానించారు. ఎంబసీ అఫ్ ఇండియా లో కౌన్సిలర్ అన్షుల్ శర్మ గారు ముఖ్య అతిధిగా విచ్చేసారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలు ప్రారంభించారు. గత 30 సంవత్సరాలు గా అమెరికా లో భారత సంతతి వారికీ సేవ చెయ్యటంలో ఆటా సంస్థ ముందంజలో ఉంది అని కొనియాడారు.
ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల ప్రెసిడెంట్ ఎలెక్ట్ మధు బొమ్మినేని అద్వర్యం లో కాన్ఫరెన్స్ కమిటీలు ప్రకటించారు. ఆటా అధ్యక్షులు భువనేశ్ బుజాల పారంభోపన్యాసం చేస్తూ కోవిద్ మహమ్మారి తర్వాత అందరిని కలుసుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మొట్ట మొదటిసారిగా డీసీ లో కనెన్షన్ నిర్వహిస్తున్నామని అమెరికా సంయుక్త దేశాల తెలుగు వారు ఇందులో విరివిగా పాల్గొనాలని కోరారు. అంగ రంగ వైభవంగా నిర్వహించబోతున్న ఈ కార్యక్రమం లో 12000 మంది కి పైగా తెలుగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి కావలిసిన అన్ని సౌకర్యాలు కల్పించటానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఆటా ప్రెసిడెంట్ గా ఎన్నిక కాబడిన మధు బొమ్మినేని మహిళలు కాన్ఫరెన్స్ లో ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు. ఆటా 17వ మహా సభల కన్వీనర్ గా సుధీర్ బండారు, కోఆర్డినేటర్ గా కిరణ్ పాశం, కాన్ఫరెన్స్ డైరెక్టర్ గా KK రెడ్డి, కో-కన్వీనర్ గా సాయి సుదిని, కో-కోర్డినేటర్ గా రవి చల్ల, కో-డైరెక్టర్ గా రవి బొజ్జ కాట్స్ ప్రెసిడెంట్ సుధా కొండపు కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. అడ్విసోరీ కమిటీ చైర్ గా జయంత్ చల్ల, రీజినల్ కోఆర్డినేటర్ శ్రావణ్ పాదురు వ్యవహరిస్తారు. 70 కమిటీస్ ను ప్రకటించారు.డీసీ తెలుగు కమ్యూనిటీలో ఎంతో మంది ప్రముకమైన వ్యక్తులను ఈ కమ్యూనిటీస్ లో సభ్యులుగా ప్రకటించారు.
17వ మహా సభల కన్వీనర్ సుధీర్ బండారు వాషింగ్టన్, వర్జీనియా రాష్ట్రాల లోని తెలుగు వారందరు కాన్ఫరెన్స్ గొప్పగా నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించవలిసిందిగా అభ్యర్ధించారు. కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ కిరణ్ పాశం మాట్లాడుతూ ఆటా తెలుగు సంస్కృతి పరిరక్షణతో పటు ఎన్నో సేవ కార్యకమాలు కూడా నిర్వహిస్తోంది అని తెలియచేసారు. కాన్ఫరెన్స్ డైరెక్టర్ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ ప్రారంభ సమావేసంలోనే మందికి పైగా తెలుగు పాల్గొనటం శుభసూచకం అని కొనియాడారు. అడ్విసోరీ కమిటీ అధ్యక్షులు జయంత్ చల్ల కాన్ఫరెన్స్ విజయవంతం చెయ్యటానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. తానా, నాట, టీడీఫ్, నాట్స్, టాటా ,GWCTS, వారధి, తాం, ఉజ్వల మరియు ఎన్నో సంస్థలు కాన్ఫరెన్స్ కి తమ సంఘీభావం ప్రకటించాయి.
అమెరికా నలుమూల నుంచి ఎంతో మంది ఆటా కార్యవర్గ, ఎగ్జిక్యూటివ్ మరియు వాలంటీర్స్ ఈ కార్యక్రంలో పాల్గొనటానికి విచ్చేసారు. 100 మంది ఆటా మరియు కాట్స్ సభ్యులు కన్వెన్షన్ సెంటర్ టూర్లో పాలుపంచుకొని ఎటువంటి ఏర్పాట్లు చెయ్యాలో ఆలోచన చేసారు. చిన్నారుల నృత్యాలు అందరిని అలరింపచేశాయి. యువ గాయని గాయకుల పాటలు శ్రోతలను రంజింపచేశాయి. ఫండ్ రైసింగ్ కార్యక్రమం లో 750 వేల డాలర్ల విరాళాలు సేకరించారు. పూర్వ ఆటా అధ్యక్షులు పరమేష్ భీంరెడ్డి, కరుణాకర్ అసిరెడ్డి లోకల్ టీం మరియు మీడియా మిత్రుల సహకారాన్ని కొనియాడారు.
2022 ఆటా సభల లోగో ఆవిష్కరణ
Related tags :