* దిశ బిల్లుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తిరిగి స్పందన రాలేదని స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ.రాష్ట్రం పంపిన బిల్లులో తమ అభ్యంతరాలను వివరణ కోరినట్లు పేర్కొన్న కేంద్ర హోంశాఖ.తాము లేవనెత్తిన అభ్యంతరాలు, వివరణలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని లోక్ సభలో తెలిపిన కేంద్ర హోంశాఖ.వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన హోంశాఖ.
* నెల్లిపాక అటవీశాఖ సెక్షన్ అధికారి పూనెం నాగరాజు ఓ వ్యక్తి వద్ద రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు.ఖమ్మం ఏసీబీ డీఎస్పీ ఎస్‌వీ.రమణమూర్తి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన బాణోత్ వీరన్న మణుగూరు-కొత్తగూడెం ప్రధాన రహదారి పక్కనున్న ఖాళీ స్థలంలో రేకుల షెడ్ నిర్మించుకున్నాడు.అయితే నాగరాజు ఆ షెడ్‌ను కూల్చి రేకులు, స్తంభాలను తీసుకొచ్చి మొండికుంటలో ఫారెస్ట్ నర్సరీలో పెట్టాడు.వీరన్న స్తంభాలు ఇవ్వాలని కోరితే రూ.15వేలు ఇవ్వాలని నాగరాజు డిమాండ్ చేశాడు.దీంతో వీరన్న 10 రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, సోమవారం ఖమ్మం ఏసీబీ డీఎస్పీ ఎస్‌వీ.రమణమూర్తి ఆధ్వర్యంలో మొండికుంట ఫారెస్ట్ నర్సరీకి వచ్చి వీరన్నతో నాగరాజుకు ఫోన్ చేయించారు.తాను భద్రాచలం బస్టాండ్‌లో ఉన్నానని, డబ్బులు తీసుకొని అక్కడికి రావాలని నాగరాజు సూచించాడు. దీంతో భద్రాచలం బస్టాండ్‌లో వీరన్న వద్ద నుంచి నాగరాజు రూ.15వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ దాడులలో ఏసీబీ సీఐలు శ్రీనివాస్, రవి, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.
* రేపటి నుంచి జరుగనున్న మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపధ్యంలో ఏవోబీ(ఆంధ్ర – ఒడిశా బోర్డర్)లో హై అలర్ట్ ప్రకటించారు. రంగంలోకి అదనపు పోలీస్ బలగాలు విశాఖ ఏజెన్సీలో వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఇన్ఫార్మర్ల నెపంతో గిరిజనులను మిలీషియా హతమార్చే అవకాశముందని భావిస్తున్న పోలీస్ వర్గాలు ఆదిశగా అప్రమత్తపు చర్యలు చేపట్టాయి. మావోయిస్టుల మాయమాటల్లో గిరిజనులు పడొద్దని పాడేరు ఎఎస్పీ జగదీష్ సూచిస్తూ పోలీసులిస్తున్న ఉపాధి శిక్షణను గిరియువత సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
* జగిత్యాల జిల్లాలో ఇసుక మాఫియా పోలీసులపై దాడికి దిగింది.ఈ ఘటనలో మల్లాపూర్ ట్రైనీ ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.పోలీసులపై దాడికి దిగిన ఇసుక మాఫియా ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.అక్రమార్కులు నిబంధనలకు విరుద్దంగా జేసీబీల సహాయంతో ఇసుకను రాత్రిపూట తరలిస్తున్నారనే విషయమై తెలుసుకొన్న ఎస్ఐ ముగ్గురు కానిస్టేబుళ్లు ఇసుక తరలిస్తున్న ప్రాంతానికి చేరుకొన్నారు.అయితే పోలీసులను గుర్తించిన ఇసక మాఫియా దాడికి దిగింది., పోలీసులపై దాడికి దిగిన ఇసుక మాఫియా అక్కడి నుండి పారిపోయారు.సంఘటన స్థలాన్ని డీఎస్పీ గౌస్ బాబా సందర్శించారు.గాయపడిన ఎస్ఐ , ముగ్గురు కానిస్టేబుళ్లను ఆసుపత్రి తరలించారు.
* నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొంతమంది అధికారుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెర్మామెన్స్ బాగా లేనివారికి మెమో జారీచేయాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై సీఎం.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారానికి నాలుగు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శించాలని చెప్పాం, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకుంటే సమస్యలెలా తెలుస్తాయని సీఎం ప్రశ్నించారు.
* కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వరుసగా బైక్ చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు కోసిగి చెందినచెందిన ఆరుగురు యువకులు ఆదోని కర్నూలు ఎమ్మిగనూరు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీలకు పాల్పడుతున్న ట్లు పోలీసులు తెలిపారు వారి వద్ద నుంచి 11 బైకులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు కాగా చోరీలకు పాల్పడిన ద్విచక్ర వాహనాలతో కర్ణాటక మద్యం రవాణాకు ఉపయోగిస్తున్నట్లు తమ విచారణలో వెల్లడైనట్లు ఆదోని డి ఎస్ సి వినోద్ కుమార్ తెలిపారు చోరీ కేసు ఛేదించిన సిఐ చంద్రశేఖర్ ఎస్ఐ రమేష్ బాబు సిబ్బంది అభినందించారు