Business

ఆగష్టు నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్-వాణిజ్యం

ఆగష్టు నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్-వాణిజ్యం

* ఆగస్ట్‌ నెలలో ఎన్నిరోజులు బ్యాంక్‌ సెలవులో తెలుసా?
నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ హాలీడే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలీడే, బ్యాంకు క్లోజింగ్ హాలీడే’ పేరుతో ఆర్బీఐ మన దేశంలో బ్యాంకు సెలవులను మూడు విభాగాలుగా విభజిస్తుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఆగస్ట్‌ నెలలో పండగలు, ఆదివారాలు, శనివారాల్ని ఆర్బీఐ హాలిడేస్‌ను ప్రకటించింది. అయితే ఈ హాలిడేస్‌ ఒక్కో రాష్ట్రాన్ని బట్టి, ఆ రాష్ట్రానికి సంబంధించిన పండగల్ని బట్టి మారిపోతుంటాయి. 
ఆగస్ట్,1 – ఆదివారం
ఆగస్ట్, 8 – ఆదివారం
ఆగస్ట్,13- దేశభక్తుల దినోత్సవం (ఇంపాల్)
ఆగస్ట్,14- రెండో శనివారం
ఆగస్ట్,15- ఆదివారం ఇండిపెండెన్స డే
ఆగస్ట్,16- పార్సి కొత్త సంవత్సరం (ముంబై, నాగపూర్, బెలాపూర్)
ఆగస్ట్,19- మొహరం
ఆగస్ట్,20- ఓనమ్ (బెంగళూరు, చెన్నై, కొచ్చి, కేరళ)
ఆగస్ట్,21- తిరుఓనం (కొచ్చి, కేరళ)
ఆగస్ట్,22- రక్షాబంధన్
ఆగస్ట్,23- శ్రీ నారాయణ గురు జయంతి (కొచ్చి, కేరళ)
ఆగస్ట్,20- ఓనమ్ (బెంగళూరు, చెన్నై, కొచ్చి, కేరళ)
ఆగస్ట్,21- తిరుఓనం (కొచ్చి, కేరళ)
ఆగస్ట్,22- రక్షాబంధన్
ఆగస్ట్,23- శ్రీ నారాయణ గురు జయంతి (కొచ్చి, కేరళ) ఇలా ఆగష్టు నెలలో పదిహేను రోజులు బ్యాకులకు సెలవులు

* దేశీయ కంటెంట్‌ షేరింగ్‌ యాప్‌ ‘షేర్‌ చాట్‌’ భారీ స్థాయిలో పెట్టబడులు సమీకరించింది. సింగపూర్‌కు చెందిన టెమాసెక్‌, మూరే స్ట్రాటజిక్‌ వెంచర్స్‌ సహా మరో సంస్థ నుంచి మొత్తం రూ.1,080 కోట్లు సేకరించింది. దీంతో సంస్థ మార్కెట్‌ విలువ మూడు బిలియన్ డాలర్లకు చేరింది. నాలుగు నెలల క్రితం టైగర్‌ గ్లోబల్‌ స్నాప్‌, ట్విటర్‌ సహా మరికొన్ని కంపెనీల నుంచి షేర్‌ చాట్‌ 502 మిలియన్ డాలర్లు సమీకరించింది. యాప్‌లో ఉపయోగిస్తున్న కృత్రిమ మేధ సాంకేతికతను మరింత అభివృద్ధి చేసేందుకు తాజా పెట్టుబడులను వినియోగిస్తామని సంస్థ తెలిపింది. తద్వారా మరింత ఫ్రెండ్లీ ఎడిటింగ్‌ టూల్స్‌ను యూజర్లకు చేరువ చేస్తామని ప్రకటించింది. చైనాకు చెందిన టిక్‌టాక్‌పై ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత దేశీయ యాప్‌లైన షేర్‌ చాట్‌, మోజ్‌లకు ఆదరణ పెరిగిన విషయం తెలిసిందే. షేర్‌చాట్‌కు 18 కోట్లు, మోజ్‌కు 16 కోట్ల యూజర్లు ఉన్నారు.

* బ్యాంకుల్లో బంగారు రుణాల బాకీలు పెరుగుతున్నాయి. కోవిడ్ వ్యాప్తి త‌ర్వాత ఉద్యోగ న‌ష్టాలు, జీతాల కోత, అత్య‌వ‌స‌ర ఆరోగ్య ఖ‌ర్చులు పెర‌గ‌డం, మొత్తం మీద‌ ఆర్ధిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన‌డంతో బంగారు రుణాలకు బాగా డిమాండ్ పెరిగింది. అలాగే ఆర్థిక ఇబ్బందుల‌తో ఉన్న వినియోగ‌దారులు బంగారం మీద తీసుకున్న రుణాల బ‌కాయిల‌ను బ్యాంకుల‌కు క‌ట్ట‌లేక బంగారాన్ని విడిపించుకోలేక‌పోతున్నారు. ఈ రుణాలు మామూలు రుణాల్లాగే బ్యాంకుల్లో పేరుకుపోతున్నాయి. ఈ జూన్ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్‌, ఫెడ‌ర‌ల్ బ్యాంక్‌, కాథ‌లిక్ సిరియ‌న్ బ్యాంక్‌ల‌లో ఈ బంగారు రుణ బ‌కాయిలు ఎక్కువ‌య్యాయి. కోవిడ్-19ను దృష్టిలో ఉంచుకుని ఐసీఐసీఐ బ్యాంక్ బంగారు రుణ ఖాతాదారుల‌కు రుణాన్ని తిరిగి చెల్లించ‌డానికి అద‌నంగా ఎక్కువ స‌మ‌యం ఇచ్చింది.

* ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో పన్నుల వసూళ్లు నికరంగా 86 శాతం పెరిగి రూ.5.57 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో ప్రత్యక్ష పన్నులు రూ.2.46 లక్షల కోట్లు కాగా.. పరోక్ష పన్నులు రూ.3.11 లక్షల కోట్లు అని లోక్‌సభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి వెల్లడించారు. ‘2021-22 మొదటి త్రైమాసికంలో నికర ప్రత్యక్ష పన్నులు రూ.2,46,519.82 కోట్లు. 2020-21లో ఇదే త్రైమాసికంలోని రూ.1,17,783.87 కోట్లతో పోలిస్తే ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 109.30 శాతం వృద్ధి ఉంద’ని ఆయన పేర్కొన్నారు. పరోక్ష పన్నుల వసూళ్లు రూ.1,82,862 కోట్ల నుంచి 70.3 శాతం పెరిగి రూ.3,11,398 కోట్లకు చేరాయని తెలిపారు. నల్లధనం (వెల్లడించని విదేశీ ఆదాయాలు- ఆస్తులు సహా), పన్నుల విధింపు చట్టం-2015 కింద 107కి పైగా ఫిర్యాదులు దాఖలయ్యాయి. 2021 మే 31 నాటికి ఈ చట్టం కింద 166 కేసుల్లో తీర్పులు వెల్లడయ్యాయి. తద్వారా రూ.8,316 కోట్ల బకాయిలు వసూలయ్యాయి. హెచ్‌ఎస్‌బీసీ కేసుల్లో రూ.8,465 కోట్ల మేర వెల్లడించని ఆదాయాన్ని పన్ను పరిధిలోకి తేవడంతో పాటు రూ.1,294 కోట్ల జరిమానా విధించారు. ఐసీఐజే (ఇంటర్నేషనల్‌ కన్షార్షియమ్‌ ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌) కేసుల్లో సుమారు రూ.11,010 కోట్ల వెల్లడించని ఆదాయాన్ని గుర్తించారు. పనామా, ప్యారడైజ్‌ పేపర్ల లీక్‌ కేసులకు సంబంధించి వరుసగా రూ.20,078 కోట్లు; రూ.246 కోట్ల వెల్లడించని ఆదాయాన్ని గుర్తించారు.

* అమెజాన్‌, బ్లూ ఆరిజిన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు భారీ ఆఫర్‌ ఇచ్చారు. 2024లో చంద్రునిపైకి మానవసహిత యాత్రకు కావాల్సిన హ్యూమన్ ల్యాండింగ్‌ సిస్టం(హెచ్‌ఎల్‌ఎస్‌)ను బ్లూ ఆరిజిన్‌ ద్వారా నిర్మిస్తామని తెలిపారు. అయితే, దీనికోసం నాసా ఇప్పటికే ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్‌ ఎక్స్‌’తో ఏప్రిల్‌లోనే ఒప్పందం కుదుర్చుకొంది. దీని విలువ 2.9 బిలియన్ డాలర్లు. కానీ, బెజోస్ మాత్రం ఈ ఒప్పందాన్ని తమకు అప్పగిస్తే రెండు బిలియన్ డాలర్ల(దాదాపు రూ.15 వేల కోట్లు) డిస్కౌంట్‌ ఇస్తామని కళ్లుచెదరే ఆఫర్‌ ప్రకటించారు.