Kids

డెల్టా వేరియంట్ దెబ్బకు రాలిపోతున్న చిన్నారులు

డెల్టా వేరియంట్ దెబ్బకు రాలిపోతున్న చిన్నారులు

డెల్టా వేరియంట్ దెబ్బకు ఇండోనేసియా విలవిలలాడుతోంది. రోజువారీ కేసుల్లో తన రికార్డులను తానే అధిగమిస్తూ తీవ్ర విలయతాండవాన్ని అనుభవిస్తోంది. ఆ దేశంలో డెల్టా ఆడుతున్న డెత్ గేమ్ తో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. అక్కడ ఐదేళ్లలోపు కలిగిన చిన్నారుల మరణాలు పెరుగుతున్నాయి. గత వారంలో 500 మంది చిన్నారులు బలికాగా.. 50 వేల కొత్త కేసులు వెలుగు చూశాయి. ఈ విలయాన్ని తట్టుకునే స్థోమత ఇప్పుడు ఇండోనేసియా వద్ద లేకపోవడంతో ఈ విపత్తు నుండి బయటపడటం అక్కడి ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. దీంతో ఈ ఆపత్కాలంలో భారత్ తన మానవత్వాన్ని చాటుకుంటోంది. ఇప్పటికే 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 100 మెట్రిక్ టన్నుల ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ ను ఇండోనేషియాకు పంపించింది.