Devotional

గణపతి ఆలయంలో ఇవి చేయండి

గణపతి ఆలయంలో ఇవి చేయండి

విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్తున్నారా..?

ఐతే ఈ నియమాలు చూడండి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

విఘ్నేశ్వరుణి ఆలయానికి వెళ్లేవారు ముందుగా ఆయన ముందు ప్రణమిల్లి 13 ఆత్మ ప్రదక్షిణాలు చేయాలి. కనీసం మూడు గుంజీలు తీయాలి. వినాయకుడికి 21 వెదురు పుష్పాలు కాని , కొబ్బరి పువ్వులను కానీ, వెలగ పుష్పాలనుకానీ అలంకరణకోసం సమర్పించాలి.

ఇవి దొరకని పక్షంలో 21 గరిక గుచ్ఛాలను సమర్పించాలి. నైవేద్యంగా చెరకు, వెలగకాయ, కొబ్బరిబోండాలను సమర్పించుకోవాలి. గణేశుని ఆలయం ప్రత్యేకంగా ఉంటే ఐదు ప్రదక్షిణాలు చేయాలి. గణేశునకు అభిషేకం అంటే మహా ఇష్టం. అయితే జలంతో కన్నా కొబ్బరినీళ్ళు, చెరకురసంతో అభిషేకం చేసినట్లైతే వ్యాపారాభివృద్ధి, వంశాభివృద్ధి, గృహ నిర్మాణాలు చేపట్టడం వంటి సత్ఫలితాలు ఉంటాయి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

జిల్లేడు లేదా తెల్ల జిల్లేడు పువ్వులతో గణేశుని పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి, అనుకున్నకార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తెల్లజిల్లేడు వేరుతో అరగదీసిన గంధాన్ని వినాయకుడిని పూసినట్లైతే అత్యంత శీఘ్రంగా కోరిక కోరికలను నెరవేరుస్తాడు.

ఇంకా చవితి హస్తా నక్షత్రం నాడు వినాయకుడు జన్మించాడు కాబట్టి, ఈ తిథుల్లోనూ, సోమవారం నాడు విఘ్నేశ్వరుడిని పూజిస్తే సుఖసంతోషాలు చేకూరుతాయి. హస్తానక్షత్రం రోజున చవితినాడు విద్యార్థులకు పలకాలు, పుస్తకాలు, విద్యకు సంబంధించిన వస్తువులు దానం చేయడం ఉత్తమం అని పురోహితులు చెబుతున్నారు.