తెలుగు న్యూస్ ఛానల్స్ లో ఒకటి అయిన టీవీ5 గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను అమ్మేసినట్లు సమాచారం.
గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు కొత్తగా డైరెక్టర్లుగా నియామకం కూడా జరిగిపోయింది. అత్యంత రహస్యంగా జరిగిన ఈ డీల్ జస్ట్ వారం క్రితమే పూర్తయినట్లు రికార్డులు చూస్తే స్పష్టం అవుతుంది.
టీవీ5 న్యూస్ ఛానల్ లో డైరెక్టర్లుగా బీఆర్ నాయుడు, శ్యాం నాయుడుతోపాటు మరొకరు ఉండే వాళ్లు. వాళ్లందరూ చైర్మన్ బీఆర్ నాయుడు ఫ్యామిలీ మెంబర్స్.
ఇప్పుడు బీఆర్ నాయుడు ఫ్యామిలీకి సంబంధించిన వారు ఎవరూ కూడా టీవీ5 గ్రూప్ ఛానల్స్ లో లేరు.
టీవీ5 ఛానల్స్ డైరెక్టర్లుగా ఒకేసారి అందరూ తప్పుకున్నారు.
కొత్త డైరెక్టర్లుగా దివ్యేష్ మానిక్ లాల్ షా, స్ముర్తీ శ్రేయాన్స్ షా, శ్రేయాన్స్ శాంతిలాల్ షా అనే ముగ్గురు కొత్త వ్యక్తులు వచ్చి చేరారు. వీళ్లందరూ గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారు. నాయుడు స్థానంలో షాలను కొత్త డైరెక్టర్లుగా నియమిస్తూ MIB ఉత్తర్వులు జారీ చేసింది.
మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ అప్రూవల్ ఇస్తూ.. ఆన్ లైన్ లో సైతం ఈ మార్పు చేసింది కేంద్ర ప్రభుత్వం.
టీవీ5 తెలుగుతోపాటు టీవీ5 కన్నడ, హిందూ ధర్మ ఛానల్స్ అన్నింటిలోనూ కొత్తగా ఈ ముగ్గురు డైరెక్టర్లే ఉన్నారు.
ఒక్కసారిగా ఈ మార్పు జరగటం చూస్తుంటే.. టీవీ5 ఛానల్స్ అమ్మేసినట్లు సమాచారం.
టీవీ5 ఛానల్స్ అమ్మకం వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వంతో.. సీఎం జగన్ తో వ్యక్తిగత కక్షతో ముందుకు వెళుతున్నారు.
ఈ క్రమంలోనే ఏపీ వ్యాప్తంగా 30 నుంచి 40 కేసులు నమోదయ్యాయి. అంతే కాదు బార్క్ లో కేసులు ఉన్నాయి.
బార్క్ కేసులన్నింటినీ సీబీఐకి అప్పగించాలని మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్ కాస్టింగ్ డిసైడ్ అయ్యింది. సీబీఐ ఎంటర్ అయితే టీవీ5 రేటింగ్ బండారం బయటపడనుంది. విచారణ ఎదుర్కోనుంది.
ఇవే కాకుండా టీవీ5 న్యూస్ ఛానల్స్ పై ఎన్ ఫోర్స్ మెంట్, ఈడీ కేసులు ఉన్నాయి. ఇటీవలే హవాలా వ్యవహారం తెరపైకి వచ్చింది. ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు విదేశీ ఖాతాల నుంచి మిలియన్ యూరోలు బదిలీ అయ్యాయని ఏపీ ప్రభుత్వం ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖకు కంప్లయింట్ చేసింది. ఈ కంప్లయింట్ ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ ప్రారంభించింది.
హవాలా లావాదేవీలు అనేవి చాలా సీరియస్ మేటర్. ఒక్కసారి ఇందులో ఇరుక్కుంటే టీవీ5 బ్యాంక్ ఖాతాలన్నీ సీజ్ చేసే అవకాశం ఉంది.
ఇదే జరిగితే ఛానల్ మనుగడకు ముప్పు ఏర్పడనుంది.
అన్ని కేసులు చుట్టుముడుతున్న క్రమంలోనే ఛానల్స్ ను అమ్మేసినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ స్థాయిలో జరిగిన చర్చల్లో.. బీజేపీ పెద్దల సహకారంతోనే గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఈ ముగ్గురు షాలు డైరెక్టర్లుగా నియామకం జరిగినట్లు మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్ కాస్టింగ్ డిపార్ట్ మెంట్ విడుదల చేసిన ఉత్తర్వులు చెబుతున్నాయి.
టీవీ5 తెలుగు, కన్నడ, హిందూ ధర్మం ఛానల్స్ అమ్మకం జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.