Politics

ఉమా బెయిల్ వాయిదా-నేరవార్తలు

ఉమా బెయిల్ వాయిదా-నేరవార్తలు

* దేవినేని ఉమా బెయిల్ పిటిషన్ను మంగళవారంకు వాయిదా వేసిన హైకోర్టు.

* ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్న టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం హేయమని గన్నవరం ఇంచార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు.

* గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి గ్రామంలో చేబ్రోలు ధన కోటేశ్వరరావు వద్ద పోలీస్ లు గంజాయిని స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించడం జరిగింది సేకరించిన వివరాల ప్రకారం విజయవాడ కొత్త వంతెన దగ్గర గల మాస్టర్ మైండ్స్ కాలేజ్ నందు ఛా కోర్స్ పూర్తి చేసిన నిందితుడు అప్పుడప్పుడు ఆల్టింగ్ డ్రైవర్ గాపనిచేస్తూ జీవనం సాగించేవాడు ఈ నేపథ్యంలో కోటేశ్వరరావు విపరీతంగా సిగరెట్లు, మద్యం, గంజాయి వంటి చెడు అలవాట్లకు భానిసగా మారిపోయాడు తన అలవాట్లకు సరిపడా సంపాదన సులువుగా ఎలా సంపాదించాలి అనే ఆలోచనలో ఓ అజ్ఞాతవ్యక్తి ద్వారా గంజాయిని సేకరించి తన గ్రామమైన కేసరపల్లి లో గంజాయిని అధిక ధర కు అమ్మి సొమ్ముచేసుకొనే వాడు. అదే క్రమంలో గురువారం రాత్రి 7 గం” లకు గన్నవరం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కే .అయోద్యబాబు కు రాబడిన అక్రమ గంజాయిని తరలించు చున్నారన్న సమాచారం మేరకు కేసరపల్లి సెంటర్ నందు హెడ్ కానిస్టేబుల్ తన సిబ్బంది తో కలిసి తనిఖీ చేయుచుండగా గ్రే కలర్ ఎన్ఫీల్డ్ బండి పై వచ్చుచున్న నిందితుడు పోలిసువారు వాహనాలను తనిఖీ చేయడం గమనించి అక్కడినుంచి పారిపోవు చుండగా పోలీసులు వెంటనే అతన్ని చుట్టుముట్టి ఎందుకు పోలీస్ వారిని చూసి పారి పోతున్నావు అని ప్రశ్న కు అతను సమాధానం చెప్పుటకు నిరాకరించాడు దాంతో పోలీస్ లు తనిఖీ చేయగా నిందుతుడు రాయల్ ఎన్ ఫీల్డ్ బండి ట్యాంకు కవర్ ప్రత్యేకంగా ప్యాక్ చేసిన కవర్ లోఉన్న వున్న సుమారుగా 500గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ వారు వెంటనే స్టేషన్ కి తరలించారు. నిందితుడువద్ద గంజాయితో పాటు రవాణా చేస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని అతన్ని కోర్టు హాజరు పర్చగా మేజీస్ట్రీట్ ఆదేశాల తో రిమాండుకి పంపిచారు.

* మాదాపూర్ లెమన్ ట్రీ హోటల్ లో ప్రియురాలి ని చంపి ప్రియుడు ఆత్మహత్య…మహబూబ్ నగర్ కు చెందిన సంతోషి, రాములు గా గుర్తించిన మాదాపూర్ పోలీసులు.

* హత్యలో సునీల్, అతని సోదరుడి పాత్ర తోసిపుచ్చలేం…మాజీ మంత్రి వివేకా హత్య కేసులో హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.- నిబంధనల మేరకే దర్యాప్తు నిర్వహిస్తున్నామని సీబీఐ పేర్కొంది.- హత్య కేసు దర్యాప్తులో సీబీఐ తమను వేధిస్తోందని కడప జిల్లాకు చెందిన సునీల్‌, అతని కుటుంబసభ్యలు, మరో ముగ్గురు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.- వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్, అతని సోదరుడు కిరణ్‌ పాత్రను తోసిపుచ్చలేమని సీబీఐ పేర్కొంది.