టోక్యో ఒలింపిక్స్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్‌లో పరాజయం పాలైంది.. ప్రపంచ నంబర్-1 చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజుయింగ్‌తో హోరాహోరీగా సాగిన పోరులో 18-21, 12-21 తేడాతో సింధు ఓటమి చవి చూసింది. కెరీర్లో అత్యధికంగా తై జు యింగ్ చేతిలోనే పరాజయం పాలైన సింధు.. ఈ మ్యాచ్‌లోనూ అదే బాటలో పయనించింది. తొలి గేమ్ ఆరంభం నుంచి నువ్వా నేనా అన్నట్లు సాగింది. 14-14, 18-18 ఇలా ఇద్దరి స్కోర్ పలుమార్లు సమం కాగా.. ఆ తర్వాత తైజు యింగ్ ఒక్కసారి వేగం అందుకోని పాయింట్లు సాధించటంతో తొలి గేమ్‌ను సింధు 18-21తో కోల్పోయింది. రెండో గేమ్‌లో సింధుపై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన తై జు యింగ్ 21-12తో ఈ గేమ్ నెగ్గి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక కాంస్య పతకం కోసం జరిగే మ్యాచ్‌లో చైనా షట్లర్ హి బింగ్జియావోతో సింధు పోటీపడనుంది.
పీవీ సింధు ఓటమి
Related tags :