* దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. మరోసారి 41వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 41,831 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. తాజాగా మరో 39,258 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 3,08,20,521 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్తగా 541 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,24,351కి చేరింది.
* ఒలింపిక్స్‌లో ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ సంచలనం సృష్టించింది. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో మణ్‌ప్రీత్ సింగ్ సేన 3-1 గోల్స్ తేడాతో బ్రిటన్‌పై విజయం సాధించింది. ఈ మెగా ఈవెంట్‌లో ఒకప్పుడు 8 గోల్డ్ మెడల్స్ సాధించినా.. తర్వాత కళ తప్పిన భారత హాకీ.. ఈసారి అద్భుతమే చేసింది. టోర్నీ మొత్తం నిలకడగా రాణిస్తున్న మన టీమ్.. లీగ్ స్టేజ్‌లో 5 మ్యాచ్‌లకు గాను 4 గెలిచిన విషయం తెలిసిందే. ఇండియా తరఫున దిల్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, గుర్జిత్ సింగ్ గోల్స్ చేశారు. తొలి హాఫ్ ముగిసే సరికే 2-0 గోల్స్‌తో లీడ్‌లో ఉన్న భారత్.. చివరి నిమిషాల్లో మరో గోల్ చేసింది. అంతకుముందే ఓ గోల్ చేసిన బ్రిటన్.. ఇండియా ఆధిక్యాన్ని కాస్త తగ్గించింది.
* ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిచిన ఖతార్ ఖతార్ వెయిట్ లిఫ్టర్ ఫారెస్ ఇబ్రహీం వెయిట్ లిఫ్టింగ్‌లో దేశంలోనే తొలి ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించాడు.23 ఏళ్ల ఇబ్రహీం టోక్యో గేమ్స్‌లో 96 కేజీల విభాగంలో మొత్తం 402 కిలోల బరువును ఎత్తి బంగారు పతకాన్ని సాధించాడు, ఇది ఒలింపిక్ రికార్డు.
* రాష్ట్రంలోని అనాధలు, అనాధ శరణాలయాల స్థితిగతులు, సమస్యలు, అవగాహన విధాన రూపకల్పన కోసం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.
* ఉదయం 6గంటల నుంచే వైయస్సార్ పింఛన్ కార్యక్రమం ప్రారంభం
* చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
* జిల్లాలోని ఆళ్లగడ్డలో ఎర్రమట్టి తవ్వకాలపై ఎలాంటి స్పందన లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. కర్నూలులో అఖిలప్రియ మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని నర్సాపురం, కృష్ణాపురంలో వైకాపా నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సీజ్ చేసిన వాహనాలు వైకాపా నేతల ఇళ్ల వద్ద ఉంటున్నాయని పేర్కొన్నారు. ఎర్రమట్టి తవ్వకాలకు కేవలం వైకాపా నేతలకే అనుమతి ఇస్తున్నారంటూ అఖిలప్రియ ఆక్షేపించారు.
* తండ్రిని వాట్సప్ ద్వారా బెదిరించి ఏకంగా రూ.కోటి డిమాండ్ చేసింది ఓ 11 ఏళ్ల బాలిక. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో జరిగింది. శాలిమార్ గార్డెన్ ఏరియాకు చెందిన 11 ఏళ్ల బాలికను తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపానికి గురైన బాలిక.. తండ్రి ల్యాప్‌టాప్ నుంచే ఆయనకు సందేశం పంపింది. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే ఆయన కుమారుడు, కుమార్తెను చంపేస్తానని బెదిరించింది. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ సందేశం అతని ఇంట్లో నుంచే వచ్చిందని గుర్తించారు. దీంతో కంగుతిన్న ఫిర్యాదుదారుడు.. కూతురిని ప్రశ్నించారు. తిట్టడం వల్లే ఈ పని చేసినట్లు బాలిక అంగీకరించింది. అయితే ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.