Business

సింధుకు కారుపై ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలు

సింధుకు  కారుపై ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలు

వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది పీవీ సింధు. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన ఈ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి.. తాజా టోక్యో విశ్వక్రీడల్లో కాంస్యంతో మెరిసింది. ఈ విజయంతో కోట్లాది భారతీయుల మోముల్లో ఆనందాన్ని నింపింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో సింధుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ ట్విటర్‌ యూజర్‌ ఆసక్తికరంగా స్పందించాడు. సింధు గెలుపునకు బహుమానంగా.. మహింద్రా కంపెనీ రూపొందించిన థార్‌ వాహనాన్ని ఆమెకు బహుమానంగా ఇవ్వాలని కోరాడు. తన కోరికను తెలియజేస్తూ మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహింద్రాను తన పోస్టుకు ట్యాగ్‌ చేశాడు. ఆ పోస్టుపై ఆనంద్‌ మ తనదైన శైలిలో స్పందించారు. ‘ఇప్పటికే సింధు గ్యారేజ్‌లో ఓ థార్‌ వాహనం పార్క్‌ చేసి ఉంది’ అని పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్‌ 2016లో పతకాలు సాధించిన పీవీ సింధు, రెజ్లర్‌ సాక్షి మలిక్‌కు అప్పుడే మహింద్రా కంపెనీ థార్‌ వాహనాలను బహుమతిగా అందించింది. ఆ విషయాన్ని ఆనంద్‌ మహింద్రా చెప్పకనే చెప్పారు.