సెంట్రల్ ఓహాయో ప్రవాసాంధ్రుల సంఘం (Andhra People of Central Ohio-APCO) ఆధ్వర్యంలో ఆదివారం నాడు వనభోజనాలు నిర్వహించారు. 140కు పైగా ఆంధ్రా సంప్రదాయక వంటకాలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 800మంది ప్రవాసులు పాల్గొన్నారు. రెండేళ్ల అనంతరం స్థానిక ప్రవాసాంధ్రులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకుని ఆహ్లాదంగా గడిపారు. కమిటీ సభ్యులు నాగేశ్వరావు మన్నే, సుశీల ఉప్పుటూరి, వేణు తలశిల, శ్రీదర్ వెగేశ్న, శ్రీనివాస్ సంగా, భ్రమరా, వేణు పసుమర్తి, రవి నవులూరి, సునిల్ వెగేస్న, మురళి పుట్టి ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.
కొలంబస్‌లో అట్టహాసంగా “ఆప్కో” వనభోజనాలు
Related tags :