* భారత్‌లో లాంఛ్ చేయనున్న సెవెన్ సీటర్ ఎక్స్‌యూవీ700 నుంచి మరో టీజర్‌ను మహీంద్ర లాంఛ్ చేసింది. వీకెండ్ టీజర్స్‌తో తన రాబోయే ఎస్‌యూవీపై అంచనాలు పెంచేస్తున్న మహీంద్ర తాజా టీజర్‌లో వాహన ఫీచర్లపై పలు సంకేతాలు వెల్లడించింది. ఎల్ఈడీ హెడ్‌లైట్స్, సీ ఆకారంలో ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు, యారో హెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్‌పై టీజర్‌లో ఫోకస్ పెట్టింది.
*ఢిల్లీలో బంగారం ధరలు ( Gold Price ) స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర కేవలం రూ.31 తగ్గి రూ.46,891కి పెరిగింది. క్రితం ట్రేడ్‌లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,922 వద్ద ముగిసింది. రూపాయి విలువ స్వల్పంగా బలపడటమే ఇవాళ ఢిల్లీలో బంగారం ధర స్వల్పంగా తగ్గడానికి కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
* దేశంలోని వివిధ చారిత్రాత్మక, భక్తిపూర్వక స్థలాలకు తీసుకెళ్లే ప్రత్యేక పర్యటన ప్యాకేజీని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రారంభించింది. ఈ నెల 29 నుంచి ఈ ప్రత్యేక పర్యటన ప్రారంభమై.. వచ్చే నెల 10 వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ‘భారత్ దర్శన్’ (IRCTC Bharath Darshan) ప్యాకేజీలో హైదరాబాద్ కూడా ఉండటం విశేషం.
దేశంలోని అన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను దర్శించుకోవడానికి వీలుగా ఐఆర్‌సీటీసీ ‘భారత్ దర్శన్’ పేరుతో ప్రత్యేక పర్యటన కార్యక్రమాన్ని చేపట్టింది. 11 రాత్రులు/12 పగల్లు ఉండే ఈ ప్రత్యేక ప్యాకేజీని పెద్దవారికి రూ.11,340 కే అందివ్వనున్నారు. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. ఈ ప్రత్యేక పర్యటనలో హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్, భావ్‌నగర్‌లోని నిష్కలంక్ మహాదేవ్ సీ టెంపుల్, అమృత్‌సర్, జైపూర్, స్టాట్యూ ఆఫ్ యూనిటీ వంటి ప్రదేశాలను చేర్చారు. ఈ ప్రత్యేక పర్యటనలో స్లీపర్ క్లాస్ టికెట్‌తోపాటు కూరగాయల భోజనం, నాన్ ఏసీ ట్రాన్స్‌పోర్ట్, హాల్ అకామడేషన్ వంటి సౌకర్యాలు కల్పిస్తారు. ఈ ప్రత్యేక పర్యటనలో పాలుపంచుకోవాలనుకునే వారు తమ టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐఆర్‌సీటీసీ జోనల్, రీజనల్ కార్యాలయాల్లో కూడా బుకింగ్ చేసుకునే వీలున్నది.
ఈ ప్రత్యేక టూర్‌కు వెళ్లే వారికి ట్రావెల్ ఇన్సురెన్స్‌తోపాటు శానిటైజేషన్ కిట్‌ను అందజేస్తారు. మధురై, సేలం, దిండిగల్, ఈరోడ్, జోనారిపెట్టై కరూర్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, నెల్లూరు, విజయవాడల్లో బోర్డింగ్ పాయింట్లు, విజయవాడ, నెల్లూరు, పెరంబూర్, కాట్పాడి, జోలారిపెట్టై , సేలం, ఈరోడ్, కరూర్, దిడిగల్, మధురైలలో డీ-బోర్డింగ్ పాయింట్లు ఏర్పాటుచేశారు. ప్రయాణం ప్రారంభానికి 48 గంటలు ముందుగా కొవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు ధ్రువీకరణపత్రాన్ని అందజేయాలి. ఈ పర్యటన పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్‌టీసీ అందజేయనున్నారు.
* ఎథేర్, బజాజ్ చేతక్ స్కూటర్‌లకు గట్టి పోటీ ఇచ్చే క్యాబ్స్ అగ్రిగేటర్ ఓలా అనుబంధ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ ( Ola Electric Scooter Launhing ) కు ముహూర్తం ఖరారైంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15వ తేదీన విపణిలోకి ఆవిష్కరిస్తున్నట్లు సీఈవో భవిష్ అగర్వాల్ మంగళవారం ట్వీట్ చేశారు. ఇప్పటికే దేశ ప్రజలంతా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.