DailyDose

వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ అరెస్ట్-నేరవార్తలు

వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ అరెస్ట్-నేరవార్తలు

* దేవినేని ఉమ బెయిల్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ.ఉత్తర్వుల కోసం రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.ఈ కేసులో ఎటువంటి గాయాలు లేవని, హత్యాయత్నం సెక్షన్లు వర్తించవని పేర్కొన్న ఉమ తరపు న్యాయవాదులు .డ్రైవర్ కులం పిటీషనర్ కు తెలియదన్న న్యాయవాది .

* విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణం రాజు పిటిషన్

* జోగులాంబ గద్వాల జిల్లా…వడ్డేపల్లి మండలం శాంతినగర్ లో సురేష్ జువెలరీ షాప్ దొంగతనంలో.. అంతర్రాష్ట్ర ముఠా నుండి 11.50 లక్షల రూపాయల విలువ గల.. (20 తులాల బంగారం, 2 కేజీల వెండి) ఆభరణాలు రికవరీ.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పి రంజన్ రతన్ కుమార్..

* అశోక్‌ గజపతిరాజు ప్రోద్బలంతోనే మాన్సాస్‌ ట్రస్ట్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారంటూ.. నమోదైన కేసులో తదుపరి చర్యలు చేపట్టవద్దని రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు మాన్సాస్‌ ట్రస్ట్‌ ఈవో అశోక్‌ గజపతిరాజు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అశోక్‌ గజపతి రాజు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో అశోక్‌పై నమోదైన కేసులో తదుపరి చర్యలను నిలువరిస్తూ హైకోర్టు మధ్యంతరం ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌ విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.

* వివేకా హత్య కేసులో సునీల్‌ యాదవ్‌ను అరెస్టు చేసినట్లు దృవీకరించిన సీబీఐ. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ… వివేకా హత్య కేసులో సునీల్‌ పాత్ర ఉందని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం లాంఛనాలు పూర్తి చేస్తున్నారని, వెంటనే అతన్ని కోర్టులో హాజరుపరుస్తారని సమాచారం.