ఉద్యోగం రాలేదని కొందరు.. ప్రేమ విఫలం అయ్యిందని కొందరు.. కడుపునొప్పి అని మరి కొందరు.. ఇలా కారణాలు ఏమైనా..
ఆత్మహత్యే పరిష్కారం అనుకొనే నేటి యువతీ యువకులకు ఆదర్శం..ఈ 70 ఏళ్ల బామ్మ జీవితం…
బతుకు కోసం ఒంటరి ప్రయాణం…
ఎవరికి తలవంచని ధీరత్వం.. ముసలితనం మీదపడుతున్నా..
దేహం ఉంది..! నెత్తురుంది…! సత్తువుంది…! ప్రాణముంది..!
జీవన పోరాటానికి ఇది చాలవా అనుకొన్న ఆమెకు జీవన పోరాటానికి వేరే సైన్యం అవసరమా…?
కాళ్ళు చేతులు పనిచేస్తున్నంత కాలం ఒకరి మీద ఆధారపడి జీవనం సాగించే గుణం కాదు ఆమెది..
కన్న కొడుకు తల్లిని చేరదీసే నైజం ఉన్నా.. అతని వద్దకు చేరని ధీరత్వం గుంటూరులో నివాసం ఉండే యల్లమందమ్మది…
డైబ్బై ఏళ్ల యల్లమందమ్మ తెల్లవారగానే సద్ది కట్టుకొని గడ్డి కోసం సైకిలెక్కి 4 కి.మీ ప్రయాణిస్తుంది. గడ్డిమోపు తీసుకొచ్చి రూ.100లకు అమ్ముతుంది. ఇలా నాలుగేళ్ల నుంచి ఈమెకు జీవనాధారం.
విశేషమేంటంటే దారిలో రెండు కిలోమీటర్లు రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో దగ్గర్లోని తెనాలి రైలు ట్రాక్‌పై (రోజుకు మూడు రైళ్లు మాత్రమే రాకపోకలు సాగించే ట్రాక్) గడ్డిమోపుతో ఉన్న సైకిల్‌ను తోసుకుంటూ వస్తుంది. ఎంతో అనుభవం ఉన్నవారికీ సాధ్యం కాదు…ఈ పని.