Videos

“బెల్ బాటం”లో ఇందిరాగాంధీ

“బెల్ బాటం”లో ఇందిరాగాంధీ

అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బెల్‌బాటమ్‌’. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. 1984లో ఓ విమాన హైజాక్‌ నేపథ్యంలో సాగే కథ ఇదని తెలుస్తోంది. ఇందులో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో లారా దత్తా నటించింది. ఇప్పటివరకూ ఆమె ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే కానీ ట్రైలర్‌ విడుదలయ్యాకా ఆమెది ఇందిర పాత్ర అని బహిర్గతం అయ్యింది. ఈ పాత్రలో లారాని చాలామంది గుర్తుపట్టలేకపోయారు. ప్రోస్థటిక్‌ మేకప్‌ సాయంతో అంతలా ఆమెను తీర్చిదిద్దారు. ‘‘బెల్‌బాటమ్‌ ట్రైలర్‌లో నన్ను చూశారా? అందులో ఇందిరా గాంధీగా కనిపించింది నేనే. అంత గొప్ప నాయకురాలి పాత్రలో నేను నటించడమంటే చాలా బాధ్యతగా భావించాను. చాలా హోంవర్క్‌ చేశాను. జీవితంలో చాలా అరుదుగా వచ్చే పాత్ర నాకు ఇచ్చినందుకు చిత్రబృందానికి ధన్యవాదాలు’’అని చెప్పింది. రంజిత్‌ తివారీ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 19న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.