* మొదటి ఇల్లును కొనుగోలు చేయడం లేదా తమకు ఇష్టమైన ఆభరణాలను కొనుగోలు చేయడం భావోద్వేగాలకు సంబంధించిన విషయం. పెట్టుబడులు ప్రారంభించేటప్పుడు రాబడి, రిస్క్, లిక్విడిటీ, పన్ను వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే బంగారం, స్థిరాస్తి పెట్టుబడుల విషయంలో అయితే ఇవేమి ఉండవు. కొన్ని సందర్భాలలో భావోద్వేగాలతో తీసుకునే నిర్ణయాలతో ఇతర అంశాలను పట్టించుకోరు. అదేవిధంగా బంంగారం, స్థిరాస్తి పెట్టుబడులు ఎప్పటికీ మంచివే అనే ఒక నమ్మకంతో ఉంటారు. అందుకే ఈ పెట్టుబడులపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు. కానీ, ఇవి కొంత రిస్క్‌తో కూడుకొని ఉంటాయి. దీర్ఘకాలంలో తక్కువ రిటర్నులను ఇవ్వడమే కాకుండా, లిక్విడిటీ సమస్యలు కూడా ఉంటాయి. అంటే పూర్తిగా ఈ పెట్టుబడులకు దూరంగా ఉండాలని ఇక్కడ ఉద్దేశం కాదు కానీ, ఎక్కువ మొత్తంలో వాటికే కేటాయించకుండా పెట్టుబడులను సమతుల్యం చేసుకుంటే మంచిదని ఆర్థిక నిపుణుల అభిప్రాయం.
* రిలయన్స్ గ్రూప్, ఆర్థిక రంగాల షేర్లపై ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. దీంతో గత నాలుగు రోజుల లాభాల జోరుకు కళ్లెం పడింది. జీవితకాల గరిష్ఠాల నుంచి సూచీలు వెనక్కి వచ్చాయి. రిలయన్స్‌లో ఫ్యూచర్ గ్రూప్ విలీనానికి వ్యతిరేకంగా సుప్రీం తీర్పు రావడంతో రిలయన్స్ షేర్లు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో సూచీలు ఇంట్రాడే గరిష్ఠాలను కోల్పోయాయి. మరోవైపు కరోనా డెల్టా కేసులు పెరుగుతుండడంతో ఆసియా-పసిఫిక్ సూచీలు అప్రమత్తంగా కదలాడాయి. అలాగే గత కొన్ని రోజుల లాభాల నేపథ్యంలో సూచీలు స్థిరీకరణ దిశగా సాగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. చివరకు సెన్సెన్స్ 215 పాయింట్లు నష్టపోయి 54,277 వద్ద.. నిఫ్టీ 56 పాయింట్లు కోల్పోయి 16,238 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.14 వద్ద నిలిచింది.
* ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడి( Richest Person ) ట్యాగ్ కోల్పోయారు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్. ఆయన స్థానంలో లూయీ విటాన్ మోయెట్ హెన్నెస్సీ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్‌గా నిలిచారు. ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్స్ లిస్ట్ ప్రకారం ఈ ఫ్రెంచ్ కుబేరుడి మొత్తం సంపద విలువ 198.9 బిలియన్ డాలర్లు (సుమారు రూ.14.74 లక్షల కోట్లు)గా ఉంది. గతంలోనూ ఆర్నాల్ట్ ఈ సంపన్నుడి ట్యాగ్‌ను ఎంజాయ్ చేశారు. డిసెంబర్ 2019, జనవరి 2020, మే 2021, జులై 2021లోనూ ఆర్నాల్ట్ ప్రపంచ కుబేరుడిగా నిలిచారు. మరోవైపు బెజోస్ సంపద విలువ 194.9 బిలియన్ డాలర్లు (సుమారు రూ.14.44 లక్షలు)గా ఉండగా.. స్పేస్ఎక్స్ చీప్ ఎలాన్ మాస్క్ 185.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.13.74 లక్షల కోట్లు)తో మూడోస్థానంలో ఉన్నారు.
* గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్ విలీనానికి వ్యతిరేకంగా సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు జారీ చేసిన అత్యవసర ఆదేశాలు చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. భారత్ చట్టాలకు అనుగుణంగా రిలయన్స్ రిటైల్‌లో విలీనంపై ముందుకు వెళ్లొద్దని ఫ్యూచర్ రిటైల్ గ్రూప్‌ను శుక్రవారం జస్టిస్‌లు రోహింటన్ ఎఫ్ నారిమన్, బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.