కరోనా వేళ న్యూజిలాండ్ సరిహద్దులు మూసేసి, విదేశీయులను తమ దేశంలోకి కాలు పెట్టనివ్వని సమయంలోనూ గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ ఆ దేశంలోకి వెళ్లగలిగారు. న్యూజిలాండ్‌లో నివాస హక్కు ఉన్నవారే కరోనా సమయంలో ఆ దేశంలోకి ప్రవేశించే వీలుంది. పేజ్ ఎలా రాగలిగారన్న విషయాన్ని న్యూజిలాండ్ పార్లమెంటులో సభ్యులకు మంత్రి ఆండ్రూ లిటిల్ వివరించారు. పేజ్ న్యూజిలాండ్‌లో అత్యవసరంగా నివాస హక్కు పొందారని నిర్ధారించారు. న్యూజిలాండ్‌లో కనీసం రూ.51 కోట్ల పెట్టుబడి పెట్టే వారికి ఆ దేశం ప్రత్యేక వీసామంజూరు చేస్తోంది. జనవరికి ముందు కొన్ని నెలలు పేజ్ కుటుంబం ఫిజీలో నివసించింది. ఆ సమయంలో అనారోగ్యంతో బాధపడిన తన కుమారుడిని పేజ్ చికిత్స నిమిత్తం న్యూజిలాండ్‌కు తరలించాలనుకున్నారు.అప్పటికప్పుడు నివాస హక్కుకు దరఖాస్తు చేయడం, కొన్ని రోజులకే న్యూజిలాండ్ అధికారులు దరఖాస్తును ఆమోదించడం జరిగిపోయాయి. తన కుమారుడిని న్యూజిలాండ్ తీసుకెళ్లి చికిత్స చేయించారు. కుబేరులు న్యూజిలాండ్‌లో అత్యవసరంగా ప్రవేశహక్కును కొనుక్కోవచ్చా? అంటూ న్యూజిలాండ్ విపక్షాలు విమర్శిస్తున్నాయి.
కొడుకు కోసం ₹51కోట్లతో ప్రవేశం కొనుక్కున్న లారీ పేజ్
Related tags :