* కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో వి-5 యూ ట్యూబ్ చానల్ విలేకరి కేశవ్ (33) ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఓ కానిస్టేబుల్.. అతడిని పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలుస్తోంది. నంద్యాల ఎన్జీవోస్ కాలనీలో నాని హాస్టల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్యపై పలు ఆరోపణలు చేస్తూ యూ ట్యూబ్ విలేకరి కేశవ్ వి-5 చానల్ లో వీడియోలను అప్‌లోడ్ చేశాడు. ఈ కారణంగా కానిస్టేబుల్ ఇటీవలే సస్పెండ్ అయ్యాడు. దీన్ని జీర్ణించుకోలేని కానిస్టేబుల్, కేశవ్‌ను తన గది వద్దకు రమ్మని ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. గదిలోనికి రాగానే స్ర్కూడ్రైవర్‌తో పొడవగా కేశవ్ అక్కడికక్కడే కుప్పకూలాడు. కేశవ్‌తోపాటు వెళ్లిన సహచర పాత్రికేయుడు ప్రతాప్ వెంటనే కేశవ్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. భార్య వాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* ధిక్కార కేసు లో హైకోర్టుకు హాజరైన నలుగురు ఐఏఎస్ లు.హైకోర్టుకు హాజరైన వారిలో పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రెటరీ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, పురపాలక శాఖ సెక్రటరీ శ్రీ లక్ష్మి, ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్.పాఠశాలల భవనాలలో రైతు భరోసా కేంద్రాలు, పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయం నిర్మాణం పై హై కోర్టులో దిక్కర కేసు విచారణ .స్కూల్ ఆవరణలో భవనాలు నిర్మించవద్దని ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని వ్యాఖ్యానించిన ధర్మాసనం .పేద పిల్లలు చదువుకునే స్కూల్ లో వాతావరణం కలుషితం చేస్తున్నారు హైకోర్టు ఆగ్రహం .ఎవరైనా ఈ పాఠశాలలో చదువుకున్నారు అని ప్రశ్నించిన హైకోర్టు జడ్జి దేవానంద్ .హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నిర్మాణాలు ఎందుకు కొనసాగుతున్నాయని ప్రశ్నించిన న్యాయమూర్తి .పాఠశాల ఆవరణ లోకి రాజకీయాలు తీసుకెళ్తారని ప్రశ్నించిన హై కోర్టు .
* మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 64వ రోజు కొనసాగుతోంది. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో అధికారులు ఇవాళ ఎనిమిది మంది అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. వీరిలో పులివెందులకు చెందిన శిఖామణి, ఓబులేసు, రఘునాథరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, సంపత్, నీలయ్య, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
* కంకర తరలిస్తున్న టిప్పర్‌కు విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పాలసముద్రం మండలం కనికాపురంలో జరిగిన ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. కనికాపురంలో ఇల్లు నిర్మించుకుంటున్న మునిస్వామి నాయుడు తన అవసరాల కోసం టిప్పర్‌లో కంకరు తెప్పించారు.
* సాధారణంగా కింది స్థాయి సిబ్బందిపైనే దాడి చేస్తే పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుంటారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తుంటారు. అలాంటిది మాదాపూర్‌లో ఓ సీఐపై దాడి జరిగితే ఎందుకు స్పందించడం లేదు? పెదవులు పగిలేలా కొట్టినా గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారు? ఇప్పుడిదే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సైబరాబాద్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయం వద్ద రేంజ్ రోవర్ కారు అటువైపుగా వేగంగా దూసుకొస్తుండటంతో సిబ్బంది ఆపేందుకు యత్నించారు. కారు ఆపకుండా రివర్స్ వెళ్లడం గమనించి అప్రమత్తమై వాహనాలను అడ్డుగా పెట్టి ఆపేశారు. కారు లోపలున్న ఇద్దరు బ్రీత్ అనలైజర్ పరీక్షలకు నిరాకరించారు. పైగా.. మమ్మల్నే ఆపుతారా? మీరెంత మీ చదువులెంత? ఒక్క ఫోన్ చేస్తే మీ బతుకులు బజారున పడతాయంటూ బెదిరించడంతో సిబ్బంది కంగుతిన్నారు. ఆపై మరింత రెచ్చిపోయి సిబ్బందిపై దాడికి దిగారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా తనపై దాడికి పాల్పడిన ఇద్దరిపై సదరు ఇన్‌స్పెక్టర్.. మాదాపూర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. సీఐపై దాడికి పాల్పడిన వారిలో ఒకరు సివిల్ కాంట్రాక్టర్ కాగా మరొకరు వైద్యుడు. వీరిలో ఒకరు పోలీస్ శాఖలో పనిచేసే సీనియర్ అధికారికి బంధువనే ప్రచారం జరుగుతోంది. దీంతో సదరు నిందితులను కాపాడేందుకు స్థానిక పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు కేసు నమోదయిందా లేదా? నిందితులను అరెస్ట్ చేశారా, లేదా? అనే విషయాలూ గోప్యంగా ఉంచుతున్నారు.