Movies

ఆయన అశ్లీలం…ఈమె ఆర్థికం. శిల్పాపై పోలీసు కేసు.

ఆయన అశ్లీలం…ఈమె ఆర్థికం. శిల్పాపై పోలీసు కేసు.

ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడినందుకు ప్రముఖ బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి, ఆమె తల్లి సునంద శెట్టిపై ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రాను ముంబయి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కేసు గురించిన విషయాలను పోలీసులు సోమవారం వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. నటి శిల్పాశెట్టి ‘అయోసిస్‌ వెల్‌నెస్‌’ అనే పేరుతో ఫిట్‌నెస్‌ సెంటర్‌ను నడిపిస్తున్నారు. దీనికి ఆమె ఛైర్మన్‌గా, ఆమె తల్లి సునంద డైరెక్టర్‌గాను వ్యవహరిస్తున్నారు. వీళ్లు మరొక బ్రాంచ్‌ ప్రారంభించడం కోసం జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే వ్యక్తుల నుంచి కోట్లాది రూపాయలు తీసుకుని మోసానికి పాల్పడ్డారు. ఈ మేరకు వీరిద్దరిపై లఖ్‌నవూలోని హజరత్ గంజ్, విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్లలో రెండు ఫిర్యాదులు వచ్చాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. వీరిని విచారించడానికి ముందుగా వారికి నోటీసులు పంపామన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సంజీవ్‌ సుమన్‌ అనే పోలీసు అధికారి ముంబయి వెళ్లనున్నారని తెలిపారు. ఆయన ఈ కేసును అన్ని కోణాల్లో పరిశీలించి దర్యాప్తు చేయనున్నారని వెల్లడించారు.