కాంక్రీట్ జంగిల్‌కు దూరంగా ప్రకృతి ఒడిలో సేదతీరుతూ వృత్తిపరమైన ఒత్తిడుల నుంచి సాంత్వన పొందుతానని అంటోంది లావణ్య త్రిపాఠి. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండే ఈ సొగసరి ప్రస్తుతం కొత్త కథలు వింటూ విరామాన్ని ఆస్వాదిస్తోంది. ఈ గ్యాప్‌లో అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సరదాగా ముచ్చటించింది. ‘జీవితంలో మనం సంతోషంగా లేనప్పుడు ఇతరులకు ఆనందాన్ని పంచలేము. ఆ సిద్ధాంతాన్ని నేను బాగా విశ్వసిస్తా. వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో అప్పుడప్పుడు తరచిచూసుకోవడం ముఖ్యమే. స్వీయ విశ్లేషణ వల్ల నేను చేసే తప్పొప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుంది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే లైఫ్‌సైకిల్ సక్రమంగా సాగుతుంది. నాకు ట్రిపోఫోబియా ఉంది. కొన్ని ఆకారాల్ని, వస్తువుల్ని చూడగానే తెలియకుండానే నాలో భయం ప్రవేశిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నా. ఈ ఏడాది నేను నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. అందుకే కెరీర్‌కు స్వల్ప విరామం తీసుకోవాలని అనుకున్నా. కానీ ఓ కథ నాలో ఆసక్తినిరేకెత్తించడంతో త్వరలో మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నా. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల ఉండేవారందరి నుంచి స్ఫూర్తి పొందుతా. ఎదుటివారిలోని మంచి లక్షణాల్ని గ్రహిస్తుంటా’ అని తెలిపింది.
నాకు ట్రిపోఫోబియా
Related tags :