DailyDose

వట్టిచెరుకూరు మండలంలో తల్లిదండ్రుల దారుణం-నేరవార్తలు

వట్టిచెరుకూరు మండలంలో తల్లిదండ్రుల దారుణం-నేరవార్తలు

* మహిమగల విగ్రహాలను అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు..వ్యాపారాలలో నష్టపోయిన వారిని టార్గెట్ చేస్తూ విగ్రహాన్ని అమ్మకాలు జరుపుతున్న కేటుగాళ్ళు..1818 సంవత్సరానికి చెందిన ఈస్టిండియా కంపెనీ సిపాయి విగ్రహం అంటూ 5 లక్షలకు అమ్మేందుకు ప్రయత్నం..నెల్లిమర్ల మండలానికి చెందిన కాళ్ళ మహేష్ కు మహిమగల దేవతా విగ్రహాన్ని అమ్మేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న ముఠా..దేవతా విగ్రహం ఇస్తామని 20వేలు తీసుకుని సిపాయి విగ్రహం ఇవ్వడంతో భయపడ్డ ముఠా యొక్క మోసం..బాధితుడు కాళ్ళ మహేష్ పిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టకున్నట్లు డిఎస్పి అనిల్ కుమార్ వెల్లడి.

* అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని చౌడమ్మ గుడి ప్రాంతానికి చెందిన వార్డు వాలంటరీ మహేష్ (25) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పొర్రాళ్ళ మహేష్ తల్లితండ్రులు గతంలోనే మృతి చెందారు. ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వారికి ఉమేష్ వివాహం చేశాడు. పురపాలక సంఘం పరిధిలోని నాల్గవ సచివాలయంలో వార్డు వాలంటీర్ గా పని చేస్తున్నాడు. పని ఒత్తిడితో పాటు ఆర్థిక సమస్యలు అధికం కావడంతో మనస్థాపానికి గురై ఇంట్లో గవాచికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దాదాపు రూపాయల మూడు లక్షలు అప్పులు ఉండడంతోపాటు మున్సిపల్ అధికారుల నుండి పని ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

* గుంటూరు జిల్లా:వట్టిచెరుకూరు మండలం, ముట్లూరులో దారుణం జరిగింది.ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులు కన్న బిడ్డను హతమార్చారు.ప్రేమ విషయమై కూతురు – తల్లిదండ్రుల మద్య వివాదం జరిగింది.ఈ ఘర్షణలో కుమార్తె భవానీ(18) మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కూతురు మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా దహనం చేశారు.గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు తల్లిదండ్రులను ప్రశ్నించారు.వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. సంఘటన ప్రదేశాన్ని పరిశీలించి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

* గ్రేటర్‌ రహదారులపై ప్రమాదాల నియంత్రణకు పోలీసులు ఓవైపు చర్యలు తీసుకుంటూనే మరోవైపు ప్రమాదాలు ఎలా? ఎందుకు జరుగుతున్నాయో..? తెలుసుకునేందుకు అధ్యయనం ప్రారంభించారు. పలు రోడ్డు ప్రమాదాలను పరిశీలించగా విస్తుగొలిపే వాస్తవాలు బయటకొచ్చాయి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా రోడ్డెక్కడమే కాకుండా, ఓవర్‌స్పీడ్‌, ఓవర్‌టేక్‌తో వారు ప్రమాదాల బారినపడడంతోపాటు అవతలి వారు క్షతగాత్రులయ్యేందుకు కారణమవుతున్నట్లు తేలింది. రోడ్డు నిబంధనలపై అవగాహన లేకపోవడం ఒకటైతే..మరికొందరు ఇతరుల వాహనాలను అడిగి రోడ్లెక్కుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనల్లో లైసెన్స్‌ లేకుండా బండి నడిపిన వ్యక్తితోపాటు వాహన యజమానిపై కూడా కేసులు నమోదవుతున్నాయి. లైసెన్స్‌ లేని వ్యక్తులకు వాహనాలు ఇవ్వొద్దని, ఇచ్చి ఇబ్బందులకు గురికావొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ముచ్చటపడినా, సరదాకైనా మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ బండి అప్పగించొద్దని కోరుతున్నారు. అర్హత లేకుండా మైనర్లు బండి నడిపి పట్టుబడితే తల్లిదండ్రులకు జైలుశిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు.

* తాటిపాకలో మానేపల్లి పంచాయతీ కార్యదర్శి ఎన్ వి సూర్యనారాయణ నివాసంలో ఏసిబి అధికారుల సోదాలు..రూ. 1.39 కోట్లు రూపాయిల అక్రమాస్తులను గుర్తించి సీజ్ చేసిన ఏసిబి అధికారులు.. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాజమండ్రి ఏసిబి డిఎస్పీ రామచంద్రరావు నేతృత్వంలో జరుగుతున్న సోదాలు..ఉభయగోదావరి జిల్లాలోని సూర్యనారాయణ బంధువుల నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసిబి అధికారులు.

* విజయవాడలో ఏఆర్ కానిస్టేబుల్ ఒకరు భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఒక వ్యక్తిని హతమార్చాడు.!ఏఆర్ కానిస్టేబుల్ శివనాగరాజు భార్య ఐస్ క్రీమ్ బండి యజమాని వెంకటేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.శివనాగరాజు డ్యూటీలో ఉన్న సమయంలో తన ఇంట్లోకి వెంకటేష్ ప్రవేశించినట్టు సమాచారం అందుకున్నాడు.వెంటనే డ్యూటీ నుంచి ఇంటికి వచ్చి వెంకటేష్‌ని పట్టుకుని కొట్టాడు.వెంకటేష్‌కు తీవ్ర గాయాలవడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకటేష్ మృతి చెందాడు.పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దాడికి పాల్పడ్డ కానిస్టేబుల్‌ డీజీపీకి వ్యక్తిగత భద్రతాధికారి కావడం గమనార్హం.