తానా ఫౌండేషన్ “చేయూత” కార్యక్రమంలో భాగంగా హయత్‌నగర్‌లోని సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ ఇంటర్నేషనల్(CSS) విభాగంలోని 250మంది విద్యార్థినులకు పుస్తకాలు, ఇతర పాఠ్యాంశ సామాగ్రిని అందజేశారు. ఈ సామాగ్రికి తానా ఫౌండేషన్ కార్యదర్శి, చేయూత కార్యక్రమ సమన్వయకర్త వల్లేపల్లి శశికాంత్ ఆర్థిక చేయూతనందించారు. లబ్ధి పొందిన విద్యార్థినులు, CSS నిర్వాహకులు శశికాంత్‌కు, తానా ఫౌండేషన్ ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరమణకు, తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరిలకు ధన్యవాదాలు తెలిపారు.
250మంది పేద విద్యార్థినులకు తానా ఫౌండేషన్ “చేయూత”
Related tags :