Business

మహీంద్ర XUV700 వచ్చేసింది-వాణిజ్యం

మహీంద్ర XUV700 వచ్చేసింది-వాణిజ్యం

* గత కొంతకాలంగా వరుస టీజర్లతో వాహనప్రియులను ఆకర్షించిన మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎట్టకేలకు ఈరోజు ప్రపంచం ముందుకు వచ్చేసింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ కారు సరిగ్గా భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు అరంగేట్రం చేయడం విశేషం. ఎక్స్‌యూవీ 500తో పోలిస్తే దీనిలో అత్యాధునిక ఫీచ‌ర్లు ఉన్నాయి. ధరను మాత్రం ఇంకా వెల్లడించలేదు. అలాగే మరిన్ని అత్యాధునిక ఫీచర్లను మున్ముందు వెల్లడిస్తామని తెలిపారు.
*** ఎక్స్‌యూవీ 700 ఫీచర్లు, ప్రత్యేకతలు..
* కంపెనీ సరికొత్త లోగోతో వస్తున్న తొలి మోడ‌ల్ ఇదే. మహీంద్రా విడుదల చేయబోయే అన్ని భవిష్యత్ ఎస్‌యూవీలపై ఈ కొత్త లోగో కనిపిస్తుంది.
* ఇంటీరియర్‌లో సరికొత్త అడ్రినాక్స్ఎక్స్‌ ఓఎస్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతికతతో కూడిన రెండు 10.25 అంగుళాల డ్యూయల్-స్క్రీన్ సెటప్ ఉంది. మన దేశంలో లభిస్తున్న మెర్సిడెస్ బెంజ్ వంటి విలాసవంతమైన కార్లలో మాత్రమే ఈ తరహా సాంకేతికతను చూడవచ్చు.
* జిప్‌, జాప్‌, జూమ్‌, కస్టమ్‌ అనే మొత్తం నాలుగు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి.
* డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉంటే అప్రమత్తం చేసేలా ‘డ్రైవర్‌ డ్రౌజీనెస్‌ మానిటర్‌ సిస్టం’తో కూడిన లెవల్‌ 1 ఆటానమస్‌ సిస్టం వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లను అందిస్తున్నారు.
* ఇంటీరియర్‌లో బ్లాక్, బేజ్ రంగులతో కూడిన డ్యూయల్ టోన్ థీమ్ డాష్‌బోర్డ్, లెదర్ సీట్లు, డోర్ ప్యాడ్‌లపై లెథర్ ఇన్సర్ట్స్ ఉన్నాయి. డ్రైవర్, కో-ప్యాసింజర్ కోసం ఈ కారులో వెంటిలేటెడ్ సీట్లను కూడా అమర్చారు.
* క్యాబిన్‌ లోపల సెంటర్ ఎయిర్ కండిషన్ వెంట్‌లను ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ క్రింద ఏర్పాటు చేశారు. దీనికి క్రోమ్ యాక్సెంట్స్ ఉన్నాయి. ఫలితంగా ఇవి క్యాబిన్‌కు మరింత ప్రీమియం రూపాన్ని అందిస్తున్నాయి.
* 99 శాతం బ్యాక్టీరియా, 95 శాతం వైరస్‌లను ఫిల్టర్‌ ఔట్‌ చేయగలిగే ఫిల్టరింగ్‌ వ్యవస్థను పొందుపరిచారు.

* అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ బ్లూఆరిజిన్‌ రాకెట్‌ ద్వారా అంతరిక్షయాత్రను విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే. రోదసి యాత్ర విజయవంతమైనందుకు గాను జెఫ్‌ బెజోస్‌ అమెజాన్‌ ఉద్యోగులకు, కస్టమర్లకు కృతజ‍్క్షతలను తెలిపారు. కాగా రోదసీయాత్ర పూర్తి చేసుకున్న జెఫ్‌బెజోస్‌పై కొంత మంది మండిపడుతున్నారు. జెఫ్‌ బెజోస్‌ అంతరిక్షయాత్రను పన్నులు కట్టకుండా డబ్బులను సంపాదించారని సోషల్‌మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. జెఫ్‌ బెజోస్‌ అంతరిక్ష యాత్ర కొంపముంచుతుంది. తాజాగా బెజోస్‌ అంతరిక్షయాత్రకు వ్యతిరేకంగా పలువురు అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను రద్దు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జెఫ్‌ బెజోస్‌ తన అంతరిక్షయాత్ర కోసం అమెజాన్‌ కస్టమర్ల, ఉద్యోగుల డబ్బులను వాడి వెళ్లి వచ్చారనే అభిప్రాయాన్ని నెటిజన్లు సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్ట్‌చేస్తున్నారు. అమెజాన్ తన మార్కెట్ శక్తిని దుర్వినియోగం చేస్తూ, చిన్న వ్యాపారాలను దెబ్బతీసేందుకే ఉద్యోగులు చెల్లిస్తున్నారన్నారు. ప‌న్నులు క‌ట్ట‌కుండా అమెరిక‌న్లు చెమ‌టోడ్చి సంపాదించి క‌ట్టిన ప‌న్నుల‌తోనే స్పేస్‌ టూర్‌ చేసి వచ్చారని నెటిజన్లు ఎద్దెవా చేస్తున్నారు. జెఫ్ బెజోస్ గత నెలలో జూలై 20 న 11 నిమిషాల్లో చారిత్రాత్మక అంతరిక్ష యాత్రను విజయవంతంగా చేపట్టారు. ఈ పదకొండు నిమిషాల అంతరిక్ష యాత్ర కోసం 16 లక్షల డాలర్లు ఖర్చు చేశారని నెటిజన్లు దుయ్యబట్టారు. అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన కొద్ది రోజులకే జెఫ్‌ బెజోస్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానం నుంచి జెఫ్‌ బెజోస్‌ వైదొలిగాడు. బెజోస్‌ స్థానాన్ని ప్రముఖ లగ్జరీ గూడ్స్‌ లూయిస్‌ విట్టన్‌ మోయెట్‌ హెన్నెస్సీ(ఎల్‌వీఎమ్‌హెచ్‌) అధినేత బెర్నాల్డ్‌ ఆర్నాల్డ్‌ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బెర్నాల్డ్‌ ఆర్నాల్డ్‌ 200.5 బిలియన్‌ డాలర్లతో ముందున్నారు. జెఫ్‌ బెజోస్‌ 190.7 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

* దేశంలోని ప్రధాన ప్ర‌భుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా రుణ‌గ్ర‌హీత‌ల‌కు తీపి క‌బురు చెప్పింది. లోన్ తీసుకోవాల‌ని భావిస్తున్న వారి కోసం ఒక మంచి ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఈ ఆఫ‌ర్‌తో రుణం తీసుకోబోయే అంద‌రికీ ప్రయోజనం కలుగనుంది. త‌మ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకునే వారికి ఇండిపెండెన్స్ డే ఆఫ‌ర్‌లో భాగంగా జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ కల్పిస్తున్న‌ట్లు తెలిపింది.