Movies

తెలంగాణా ఇంకా బానిస సంకెళ్లల్లోనే ఉంది

తెలంగాణా ఇంకా బానిస సంకెళ్లల్లోనే ఉంది

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు పూర్తైనప్పటికీ రాష్ట్రం ఇంకా గడీ కబంధ హస్తాల్లోనే ఉందని భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి అన్నారు. నాటి నిజాం కర్కశ పాలన.. గడీల కబంధ హస్తాలు.. మధ్యలో బ్రిటిష్ వారి అరాచకాలు… నేడు మరింత తీవ్రరూపం దాల్చాయని ఆమె అభిప్రాయపడ్డారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పరిస్థితిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఆమె స్పందిస్తూ కింది విధంగా రాసుకొచ్చారు. ‘‘భారతదేశపు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశమంతా పండుగ వాతావరణం నెలకొంది గానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఏడేళ్ళయినా ఇక్కడ మాత్రం ప్రజలు బానిసల్లాగే బతుకు గడుపుతున్న పరిస్థితి నెలకొంది. నాడు