‘ఇస్మార్ట్ శంకర్’లో ఊరమాస్ మాటలతో యువతలో క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ నభానటేశ్. ప్రస్తుతం తెలుగులో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆమె.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్‌హీరో హృతిక్ రోషన్ సరసన నటించే అవకాశాన్ని నభా సొంతం చేసుకున్నట్లు సమాచారం. హాలీవుడ్‌లో విపరీతమైన ప్రేక్షకాదరణ పొందిన స్పై థ్రిల్లర్ ‘ది నైట్ మేనేజర్’ టీవీ సిరీస్‌ని త్వరలో ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వెబ్‌సిరీస్ రూపంలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా, ఈ సిరీస్‌లో నటుడు హృతిక్‌రోషన్ ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఉందని.. ఆయన సరసన కథానాయికగా నభానటేశ్ అవకాశం దక్కించుకుందని పలు ఆంగ్ల పత్రికల్లో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ అదే కనుక నిజమైతే నభానటేశ్ దశ తిరిగినట్లే అని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. మరోవైపు తెలుగు కథానాయికలు రష్మిక, సమంత, రకుల్‌ప్రీత్ సింగ్ ఇప్పటికే బాలీవుడ్‌లో తమ లక్ పరీక్షించుకుని అవకాశాలు చేజిక్కించుకున్నవాళ్లే.
హృతిక్‌తో నభా?
Related tags :