NRI-NRT

కొలంబస్‌లో ఉల్లాసంగా టాకో వనభోజనాలు

కొలంబస్‌లో ఉల్లాసంగా టాకో వనభోజనాలు

టాకో (తెలుగు అసోషియేషన్ ఆఫ్ సెంట్రల్ ఒహాయో) ఆధ్వర్యంలో కొలంబస్ లోని హైబాంక్స్ పార్కులో శనివారం నాడు వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రవాసులు ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో ఉల్లాసంగా పాల్గొన్నారు. ఉదయం అల్పాహారంతో మొదలై రకరకాల రుచికరమైన వంటకాలతో వనభోజనాలు సాగాయి. పిల్లలకి, పెద్దలకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమ విజయవంతానికి తోడ్పడిన వారికి టాకో అద్యక్షుడు శివ చావ, కార్యవర్గం ధన్యవాదాలు తెలిపారు.