NRI-NRT

అట్లాంటాలో పీవీ విగ్రహం

అట్లాంటాలో పీవీ విగ్రహం

మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు శత జయంతి ఉత్సవాలను అన్ని దేశాలలో పెద్ద ఎత్తున నిర్వహించిన విషయం తెలిసిందే , ఈ సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా 5 దేశాలలో పీవీ విగ్రహాలని స్థాపించాలని అమెరికాలోని అట్లాంటాలో పెట్టాలని ఇండియన్ మరియు తెలుగు సంస్థల ప్రతినిధులు సన్నాహక సమావేశమయ్యారు , ముఖ్య అతిధిగా హాజరైన మహేష్ బిగాల మాట్లాడుతూ సీఎం కెసిఆర్ ఆలోచన మేరకు పీవీ శత జయంతి ఉత్సవాలు సంవత్సరం జరుపుకున్నాం, ప్రపంచవ్యాప్తంగా 5 దేశాలలో పీవీ విగ్రహాన్ని ప్రతిష్ఠాపించాలని తీసుకొన్న నిర్ణయములో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో స్థల పరిశీలన జరిగింది , అట్లాంటాలోనే గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయాన్నీ గుర్తు చేసారు. ఈ సమావేశములో రాబోయే రోజుల్లో విగ్రహ ప్రతిష్టాపన గురించి కేశవరావుతో చర్చించి నవంబర్ లో ఏర్పాటు చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అమెరికాలో తెలుగు సంఘాలే కాకుండా ఎన్నారై మరియు ఎన్ఆర్ఐ సంస్థల సభ్యులు అందరూ పీవీ నరసింహ్మ రావు గారికి భారత రత్న ఇవ్వాలని కోరుతున్నారు ఆ విషయాన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. కార్యక్రమంలో డా.పాడి శర్మ, అంజయ్య చౌదరి లావు, చాంద్ అక్కినేని, సునీల్ సవిలి, శివకుమార్ రామడుగు, సందీప్ గుండ్ల, గణేష్ కోసం, శ్రీనివాసులు రామిశెట్టి, కీర్తిదర్ గౌడ్ చకిలం తదితరులు పాల్గొన్నారు.