Fashion

చుండ్రుకు విరుగుడు జింక్

చుండ్రుకు విరుగుడు జింక్

కాలమేదైనా కొందరికి చుండ్రు నిరంతరం వేధిస్తుంటుంది. దీన్ని పోగొట్టుకోవటానికి చాలామంది చేసే పని యాంటీ-డాండ్రఫ్‌ షాంపూలు వాడటం. దీంతో పాటు ఆహారం మీదా దృష్టి పెట్టటం మంచిది. ముఖ్యంగా జింక్‌తో కూడిన పదార్థాలు తినటం మేలు. మన మాడు మీద చాలా తైల గ్రంథులుంటాయి. వీటిలోంచి పుట్టుకొచ్చే నూనెలు (సీబమ్‌) మాడుకు రక్షణ కల్పిస్తుంటాయి. అలాగని ఇవి ఎక్కువగా ఉత్పత్తయినా కష్టమే. చుండ్రుకు దారితీయొచ్చు. సీబమ్‌ ఉత్పత్తిని నియంత్రించటానికి జింక్‌ తోడ్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇదొక్కటే సరిపోదు. విటమిన్‌ బి6 కూడా అవసరమే. జింక్‌ను శరీరం బాగా గ్రహించుకోవటానికిది తప్పనిసరి. కాబట్టి కందులు, పెసలు, శనగలు, మినుముల వంటి పప్పులు.. బాదం, పిస్తా, అక్రోట్ల వంటి గింజ పప్పులు.. జొన్నలు, సజ్జలు, దంపుడు బియ్యం, పొట్టుతీయని గోధుమల వంటి ధాన్యాలు తరచూ తినేలా చూసుకోవాలి.