Business

₹10లక్షలకు సరికొత్త బొలెరో-వాణిజ్యం

₹10లక్షలకు సరికొత్త బొలెరో-వాణిజ్యం

* కరోనా కల్లోలంతో అతలాకుతలమవుతున్న సామాన్య ప్రజల ఇంట కేంద్ర ప్రభుత్వం చాపకింద నీరులా వంట గ్యాస్‌ మంట పెడుతోంది. చమురు ధరలనూ భగ్గుమనిపిస్తోంది. తొమ్మిది నెలల కాలంలో సిలిండర్‌పై సుమారు రూ.265.50 పెంచింది. గడిచిన ఏడాది అక్టోబరు, నవంబరులో బిహార్‌ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలుండటంతో సెప్టెంబరు నుంచి నవంబరు వరకు ధరలు పెంచలేదు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు నాలుగు నెలల్లో అయిదు సార్లు పెంచింది. అంతర్జాతీయ మార్కెట్‌ ధరల ఆధారంగా దేశీయంగా చమురు సంస్థలు ధరల్లో మార్పులు, చేర్పులు చేస్తుంటాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలను రోజు వారీగా పెంచుతున్న సంస్థలు వంట గ్యాస్‌ రేట్లలో ప్రతి నెలా ఒకటీ,రెండు తేదీల్లో మార్పులు చేస్తుంది. 15 రోజులకోసారి ధరల్లో సవరణలు చేసేందుకు కసరత్తు చేసింది. ఒక్క ఫిబ్రవరి నెల మాత్రమే రెండు దఫాలుగా పెంచింది. ఈనెలలో ఒకటో తేదీ బదులు 17వ తేదీ పెంచింది.

* * బంగారం వ‌ర్త‌కుల‌పై పెనుభారం మోపుతూ కేంద్రప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన హాల్‌మార్క్ యూనిక్‌ ఐడింటిఫికేష‌న్ నంబ‌ర్ (హెచ్‌యుఐడి)ని త‌క్ష‌ణం ఉప‌సంహ‌రించుకోవాల‌ని ఈ నెల 23న దేశ‌వ్యాప్తంగా ఒక్కరోజు బంద్‌

* ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు ఎప్పుడు ఫైల్ చేసినా కొన్ని ప‌త్రాల‌ను సేక‌రించి క్ర‌మ ప‌ద్ధ‌తిలో పొందుప‌ర‌చుకోవాలి. పెట్టుబ‌డుల‌కు సంబంధించిన రుజువులు, ఫారం-16, టీడీఎస్ స‌ర్టిఫికెట్లు వంటివి ముందుగానే సిద్ధం చేసుకోవాలి. రిట‌ర్నులు ఫైల్ చేసే తొంద‌ర‌లో చాలా మంది చిన్న చిన్న వివ‌రాల‌ను ప‌రిశీలించ‌డం మ‌ర్చిపోతారు. ఒక‌వేళ చిన్న నిర్ల‌క్ష్యం జ‌రిగినా మొత్తం ప్రక్రియ‌కు ఆటంకం క‌లిగే అవ‌కాశం ఉంటుంది.

* ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా బొలెరో నియో మోడల్‌లో మరో కొత్త వేరియంట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. నియోలో ఎన్‌4, ఎన్‌8, ఎన్‌10 మోడళ్లను జూన్‌లో విడుదల చేసిన సంస్థ తాజాగా ఈ కోవకే చెందిన ఎన్‌10(ఓ) వేరియంట్‌ను తాజాగా వాహనప్రియుల ముందుకు తీసుకొచ్చింది. ఇది మొత్తం ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.10.69 లక్షలు(ఎక్స్‌షోరూం).ఎన్‌10 ఫీచర్లే ఈ సరికొత్త బొలెరో నియో ఎన్‌10(ఓ)లోనూ ఉన్నాయి. అయితే, ఎన్‌10(ఓ)లో అదనంగా ‘మెకానికల్‌ లాకింగ్‌ రేర్‌ డిఫరెన్షియల్‌’ అనే అదనపు ఫీచర్‌ అందిస్తున్నారు. దీని వల్ల వెనుక చక్రాల రెండింటికీ సమానమైన టార్క్‌ అందుతుంది. కొన్నిసార్లు ప్రత్యేక పరిస్థితుల్లో ఒకే వీల్‌ తిరగడం వల్ల సంభవించే ప్రమాదం ఈ లాకింగ్‌ డిఫరెన్షియల్‌ వల్ల తప్పుతుంది.ఇక మిగిలిన ఫీచర్ల విషయానికి వస్తే.. రివైజ్డ్‌ డీఆర్‌ఎల్‌ హెడ్‌ల్యాంప్స్‌, కొత్త ఫ్రంట్‌ బంపర్‌, న్యూ ఫాగ్‌ ల్యాంప్స్‌ ఉన్నాయి. కారు ఇంటీరియల్స్‌ విషయానికి వస్తే..టీయూవీ 300ను పోలి ఉంటుంది. బ్లూటూత్‌తో కూడిన 7 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ను అమర్చారు. స్టీరియో మౌంటెడ్‌ ఆడియో కంట్రోల్స్‌, క్రూజ్‌ కంట్రోల్‌, బ్లూ సెన్స్‌యాప్‌ కూడా ఉన్నాయి.బొలెరో నియో ఎన్‌10(ఓ) ఇంజిన్‌ విషయానికి వస్తే.. 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో, గరిష్ఠంగా 100బీహెచ్‌పీ శక్తి‌, 260ఎన్‌ఎం గరిష్ఠ టార్క్‌ను అందిస్తోంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను జత చేశారు. బొలెరో నియో నపోలీ బ్లాక్, మెజెస్టిక్ సిల్వర్, హైవే రెడ్, పెర్ల్ వైట్, రాకీ బీజ్‌ మొత్తం ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది.

* కరోనా మూలంగా తలెత్తిన ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తూనే.. వృద్ధికి ఊతమివ్వాల్సిన అసవరం ఉందని ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ)’ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. ఆగస్టు 4-6 మధ్య జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం వివరాలు శుక్రవారం విడుదలయ్యాయి. కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే.