* యూనివర్సిటీలో శోభనమా?… ఇదెక్కడి చోద్యం?జేఎన్టీయూ కాకినాడ విశ్వవిద్యాలయంలోని అతిథి గృహంలో ఓ జంట శోభనానికి ఏర్పాట్లు జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.- అసలు ఇటువంటి కార్యక్రమాలకు అతిథిగృహాన్ని.. అది కూడా చదువులకు నిలయమైన యూనివర్సిటీలోని గదులను వినియోగించడంపై విమర్శలు వస్తున్నాయి.తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలోని అతిథి గృహంలో.. నూతన వధూవరుల శోభనానికి జరిగన ఏర్పాట్ల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సాధారణంగా విశ్వవిద్యాలయంలోని అతిథి గృహాన్ని.. యూనివర్సిటీకి చెందిన వారికి మాత్రమే కేటాయిస్తారు.కానీ.. ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ స్వర్ణకుమారి పేరిట ఈ నెల 18 నుంచి మూడు రోజులపాటు అతిథిగృహాన్ని అద్దెకు తీసుకున్నారు.ఈ క్రమంలోనే.. వివాహ వేడుక అనంతరం ఒక గదిలో శోభన ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఇలాంటి వాటిని అనుమతించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ వ్యవహారంపై వర్సిటీ అధికారులు విచారణ చేపట్టారు. ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేశారు.
* కాబుల్ విమానాశ్రయంలో తొక్కిసలాట- ఏడుగురు మృతి!
* శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం కుదిరి గ్రామంలో 2 ఆలయాల్లో హుండీ చోరీ గురైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.
* విజయవాడ నగర శివారు పాయికాపురం శాంతినగర్ లో గంజాయి మత్తులో బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు వీరంగం..పుల్లుగా మద్యం సేవించి గంజాయి మత్తులో తననితాను బ్లేడ్ తో గాయపరచుకొని రక్తం గాయాలతో స్థానికులను భయభ్రాంతులకు గురి చేసిన మాజీ నేరస్తుడు రెడ్డిపల్లి సత్యారావు…తీవ్ర రక్తస్రావం తో ఉన్నా అతనికి సహాయ చర్యలు కోసం దగ్గరకు రానీయకుండా కాసేపు హల్ చల్ చేసిన సత్యారావు..సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకుని బ్లేడ్ బ్యాచ్ సభ్యుడిని ఆస్పత్రికి తరలించిన నున్న గ్రామీణ పోలీసులు..
* ఓ మంత్రి సహా అధికార పార్టీ ఎమ్మెల్యేకు సంబంధించిన ఆడియో టేపుల వ్యవహారంపై విచారణ అవసరమని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.