* శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఏఆర్ పోలీసులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసింది: డిజిపి. కలకత్తాలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి వస్తుండగా ప్రమాదం జరిగింది.
* రైలులో ప్రయాణికురాలి లగేజీ చోరీ అయిన కేసులో నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ లోని వినియోగదారుల ఫోరం కీలక తీర్పు ఇచ్చింది. రైలులో చోరీ జరిగితే రైల్వేదే బాధ్యత అని తేల్చి చెప్పింది. ప్రతి ప్రయాణికుడు వినియోగదారుడే అని, భద్రత కల్పించాల్సిన బాధ్యత రైల్వే వర్గాలదే అని స్పష్టం చేసింది. అంతేకాదు చోరీకి గురైన నగల విలువ, నగదును ప్యాసింజర్ కు చెల్లించాల్సిందే అని వినియోగదారుల ఫోరం తీర్పునిచ్చింది.
* కర్నూల్ లో హనీ ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్…..మహిళలతో చనువుగా ఫోన్ చేయించి ఇంటికి పిలిపించుకుని అర్ధనగ్న ఫోటోలు తీసి … బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న 5 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు….నిందితుల నుంచి 4 లక్షల విలువైన 2 ప్రాంసరి నోట్లు, 4 లక్షలు విలువైన 2 చెక్కులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి వెల్లడి.
* తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న నాటి నుంచి ఆ దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేశాధ్యక్షుడే దేశం విడిచి పారిపోయాడంటే అక్కడ పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అఫ్గన్ సైన్యం ఏమాత్రం ప్రతిఘటించకుండా తాలిబన్లకు లొంగిపోయింది. తాలిబన్ల రాక్షస పాలన గురించి తెలిసిన ఆ దేశ ప్రజలు.. అక్కడ నుంచి విదేశాలకు వలస వెళ్తున్నారు. అఫ్గన్‌ను ఆక్రమించిన తాలిబన్లను.. పంజ్‌షీర్ ప్రావిన్స్ మాత్రం కలవరపెడుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్గన్‌ను ఆక్రమించిన తాలిబన్లు.. తమను సవాలు చేస్తున్న పంజ్‌షీర్ లోయ ఆక్రమణకు ప్రయత్నించారు.