* దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త ప్రకటించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు పెన్షన్ (Bank Pensions) పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి దేబశీష్ పాండా బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇప్పుడు బ్యాంకు ఉద్యోగి చివరగా తీసుకున్న జీతంలో 30 శాతం యూనిఫాం స్లాబ్‌లో పెన్షన్ పొందుతారు. దాంతో ఇప్పటివరకు రూ.9,284 గా ఉన్న పెన్షన్ కాస్తా రూ.30,000-35,000కు పెరుగనున్నది.
* కరోనా మహమ్మారితో వర్క్ ఫ్రం హోం.. లెర్నింగ్ ఫ్రం హోం కల్చర్ పెరిగింది. దాంతోపాటు ఐటీ ప్రొఫెషనల్స్‌కు గిరాకీ ఎక్కువైంది. ఇంతకుముందు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), డేటా అనలిటిక్స్ తదితర సాఫ్ట్‌వేర్‌లకు డిమాండ్ ఉండేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నిపుణుల అభివ్రుద్ది కోసం గతేడాది ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ సదస్సు నిర్వహించింది. తాజాగా క్లౌడ్ ప్రొఫెషనల్స్ కోసం అన్వేషణ పెరుగుతున్నది. దీంతో క్లౌడ్ ప్రస్తుతం మెయిన్‌స్ట్రీమ్, ఫౌండేషనల్ డిజిటల్ టెక్నాలజీగా అవతరించింది. తత్ఫలితంగా ఐటీ సంస్థలు క్లౌడ్ సొల్యూషన్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.
* భారత మార్కెట్‌లో సెప్టెంబర్ 1న న్యూ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 లాంఛ్ కానుంది. సెప్టెంబర్ 1న మీ డేట్ బ్లాక్ చేసుకోండని రాయల్ ఎన్‌ఫీల్డ్ సంకేతాలు పంపింది. ఇదే రోజున 2021 ఆర్ఈ క్లాసిక్ 350 లాంఛ్ అవుతుందని కంపెనీ అధికారికంగా వెల్లడించకపోయినా సెప్టెంబర్ 1న ఈ బైక్ దేశీ మార్కెట్‌లో సందడి చేస్తుందనే సంకేతాలు అందుతున్నాయి. ఇదే రోజున ఆర్ఈ క్లాసిక్ 350 ధరను కూడా కంపెనీ వెల్లడించనుంది.
* నాలుగేళ్లలో రూ.6లక్షల కోట్లు సమకూర్చడమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్‌పై విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు రాహుల్ గాంధీకి మానిటైజేషన్ అంటే అర్థమవుతుందా? అని దుయ్యబట్టారు. 70 ఏళ్లలో సృష్టించిన ఆస్తులను భాజపా అమ్మేస్తోందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దేశంలోని వనరులన్నింటినీ అమ్మి ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. గత 70 ఏళ్లలో దేశంలో ఏమీ జరగలేదంటూనే ఆ సమయంలో సృష్టించిన ఆస్తులను భాజపా ప్రభుత్వం అమ్మేస్తోందని రాహుల్‌గాంధీ మంగళవారం విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కీలక రంగాల్లో గుత్తాధిపత్యం, ఉద్యోగాలను నాశనం చేయడమే లక్ష్యంగా మోదీ సర్కార్ ప్రయివేటీకరణ ప్రణాళిక ఉందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వాలు సృష్టించిన సంపదనంతా విక్రయించే ప్రక్రియలో ప్రభుత్వం ఉందన్నారు.