WorldWonders

విశాఖ ఫార్మా కంపెనీలో 900గ్రా పౌడర్ చోరీ. ధర ₹27లక్షలు.

విశాఖ ఫార్మా కంపెనీలో 900గ్రా పౌడర్ చోరీ. ధర ₹27లక్షలు.

విశాఖ ఫార్మాసిటీలోని బయోఫోర్ ఫార్మా కంపెనీలో చోరీ కలకలంరేపింది.

కంపెనీలో చాలా విలువైన పెలాడియం పౌడర్ మాయమైంది.

నెల రోజుల కిత్రమే ఈ సంఘటన జరగ్గా.. ఆలస్యంగా బయటపడింది.

యాజమాన్యం పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కంపెనీలో ప్రొడక్షన్‌కు సంబంధించి పెలాడియం ఆక్సైడ్ (పౌడర్) సుమారు 900 గ్రాములు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

ఈ మెటీరియల్‌ను కేజీల రూపంలో విక్రయిస్తారు. దీని ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ వ్యవహారంలో కంపెనీకి చెందిన వేర్ హౌస్ ఉద్యోగుల పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కరోనా కారణంగా సెక్యూరిటీ సిబ్బంది కంపెనీ గేటు దగ్గర సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టకపోవడంతో మెటీరియల్‌ను ఈజీగా తరలించగలిగారని భావిస్తున్నారు.

900 గ్రాములు ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు కొన్ని గ్రాముల చొప్పున తరలించినట్లు యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తుంది.

ఈ వ్యవహారంపై యజమాన్యం ఫిర్యాదు చేశారు.. దీని విలువ సుమారు రూ.27 లక్షలపైనే ఉంటుందని ప్రస్తావించారు.

ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ వ్యవహారంలో ఎంత మంది పాత్ర ఉంది?. ఎప్పుడు తరలించారో విచారణ చేస్తున్నామన్నారు.