* కృష్ణా జిల్లా మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన నకిలీ చలానాల వ్యవహారంలో ప్రధాన నిందితుడైన స్టాంప్ వెండర్ దీరజ్‌ను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తెలిపారు. కృష్ణా జిల్లా కైకలూరు టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. కేవలం 48గంటల్లో 640 నకిలీ చలానాలలో 450 చలానాలకు సంబంధించి రూ.1.02 కోట్ల నగదు ప్రభుత్వ ఖజానాలో జమ చేయించామని తెలిపారు. నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. ఈ వ్యవహారంలో నిందితులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వారిని గుర్తించి చట్టపరమైన, శాఖపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. నిందితుల వద్ద నుంచి వందశాతం నగదు రికవరీ చేస్తామన్నారు.
* స్టార్ హోటల్ నిర్మాణానికి రుణాల పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్సార్టియానికి రూ.159 కోట్లు మోసం చేసిన వారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. డబుల్ ట్రీ బై హిల్టన్ హోటల్ నిర్మాణం పేరిట రుణాలు పొంది ఇతర ఖాతాలకు మళ్లించినట్టు సీబీఐ అభియోగం. సప్త రుషి హోటల్స్, మహా హోటల్స్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. డైరెక్టర్లు ఎల్.ఎన్.శర్మ, యశ్‌దీప్ శర్మ, సునీతశర్మ, ఆగస్త్య ట్రేడ్ లింక్స్, ఖందాల్ ట్రేడింగ్, రజనీగంధ డిస్టిబ్యూటర్స్, సింబియాసిస్ ఎయిర్ వర్క్స్‌పై కూడా సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
* మాచర్ల మండలం ఏకానాంపేట వద్ద కృష్ణా నది జల మార్గం నుంచి చేపల పుట్టిలో అక్రమంగా తరలిస్తున్న 400 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు గురజాల డిఎస్పి మెహర్ జయరామ్ ప్రసాద్ గురువారం తెలిపారు. డిఎస్పి మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీ లోకి అక్రమంగా నాటుసారా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో విజయపురిసౌత్ ఎస్ ఐ పి.అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దాడి చేసి నాటుసారా పట్టుకున్నట్లు పేర్కొన్నారు.నాటుసారా అక్రమంగా తరలిస్తున్న మేరావత్ రంగా నాయక్ ను అదుపులోకి తీసుకోగా,మరో ముగ్గురు నిందితులు పరారయ్యారని, వారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు.ప్రధాన నిందితుడు రంగ నాయక్ 2 వారాల క్రితం 390 లీటర్ల నాటుసారా తరలిస్తూ పట్టుబడినట్లు చెప్పారు.ఎవరైనా అక్రమంగా మద్యం, నాటుసారా, గుట్కాలు,రేషన్ తరలిస్తే చర్యలు తప్పవన్నారు.
* ఆన్‌లైన్ క్లాసులు ప్రత్యామ్నాయం మాత్రమేనని ఎపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పాఠశాలలు, కాలేజీలు తెరిచాక కూడా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని కొన్ని పాఠశాలలలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి వాస్తవమేనని తెలిపారు. 10 కన్నా ఎక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో పాఠశాలలు ప్రారంభించవద్దని గతంలోనే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. పాఠశాలలు, కాలేజీల్లో ఫీజులకు సంబంధించి 53, 54 జీవోలను జారీ చేశామని పేర్కొన్నారు.
* 11వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పద్మనాభ మండల సర్వేయర్ ఉపేంద్ర.బ్రాందేయపురంలో నాలుగు ఎకరాల భూమికి సర్వే చేయడానికి 18 వేలు లంచం డిమాండ్ చేసిన సర్వేయర్.11 వేల లంచం తీసుకున్న వ్యవహారంలో ప్రముఖ పాత్ర వహించిన బ్రాందేయపురం, మిద్దె సచివాలయ సర్వేయర్లు.ఏసీబీ అదుపులో మండల సర్వేయర్ ఉపేంద్ర, బ్రాందేయపురం సచివాలయం సర్వేయర్, మిద్దె సచివాలయం సర్వేయర్.
* జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ లో ఉన్న అడ్మిరన్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ నుండి వెలువడుతున్న వ్యర్ధ రసాయన విషవాయువులు, పరుగులు తీసిన కార్మికులు. విషవాయువుల పిల్చలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమీప తాడి గ్రామస్తులు, కర్మాగారం ఎదుట ఆందోళన.