అందరూ కోకాకోలాని తాగుతారు. కానీ బ్రెజిల్‌లోని రియో గ్రాండ్ డెల్ నార్టె ప్రాంతానికి వెళ్లినవాళ్లు మాత్రం కోకాకోలా సరస్సులో ఈతకొడతారు. ‘అదెలా…’ అని ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ… ఈ సరస్సులోని నీళ్లు అచ్చం కోకాకోలా డ్రింకులానే ఉంటాయట మరి. అందుకే, ‘లాగొవా డా అరారక్వరా’ అనే ఈ సరస్సును అందరూ కోకాకోలా లేక్ అని పిలుస్తారు. అయోడిన్, ఐరన్ స్థాయులు ఎక్కువగా ఉండడంతో ఇక్కడి నీటికి ఆ రంగు వచ్చిందట. ఈ వింతను చూసేందుకూ కోకాకోలా నీటిలో జలకాలాటలు ఆడేందుకూ ఎందరో పర్యటకులు ఈ చోటుకి వస్తుంటారట.
కోకాకోలా సరస్సులో ఈత
Related tags :