మధుమేహం..ఇప్పుడు దీనిగురించి తెలియని వారుండరు. ఒకప్పుడు మధ్యవయస్సులో వచ్చే ఈ చక్కెర వ్యాధి..ప్రస్తుతం చిన్నతనం నుంచే వెంటాడుతోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో దీనిబారిన పడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే గ్రామాలతో పోలిస్తే పట్టణ, నగర ప్రాంతాల్లో డయాబెటిక్ (షుగర్ వ్యాధి) రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన వ్యాయామం లేకపోవడం, విపరీత ఒత్తిడికి గురవడం లాంటి కారణాలు కూడా మధుమేహం సోకేందుకు కారణంగా చెప్పొచ్చు. అనారోగ్యం బారిన పడి టెస్ట్‌లు చేయించుకుంటే తప్పా చాలామందికి షుగర్ ఉన్నట్లు తెలియడం లేదు. 70 నుంచి 80 శాతం మంది చివరిదశలోనే వ్యాధి ఉన్నట్లు తెలుసుకొని ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క గ్రేటర్‌లోనే మధుమేహం బాధితులు అధికంగా ఉన్నట్లు వైద్య,ఆరోగ్య సంస్థల గణాంకాల ద్వారా తెలుస్తోంది. వ్యాధి పేరులోనే తీపిదనం ఉంది. ఇది క్రమంగా తియ్యటి విషంలా మనిషి ప్రాణాలు తీస్తున్నదని ఉస్మానియా ఎండ్రోక్రినాలజిస్టు డాక్టర్ రాకేష్‌సాహె తెలిపారు. ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్య వచ్చినప్పుడు లేదా శస్త్రచికిత్సలు చేసే సమయంలో ఈ వ్యాధి బయటపడుతుంది. వైద్య పరిభాషలో దీన్ని స్వీట్ పాయిజన్ అంటారు. డయాబెటిస్ ప్రభావం చూపే అవయవాలు : గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కండ్లు, కీళ్లు, కండరాలు, నరాలు
హైదరాబాద్‌లోనే మధుమేహులు అధికం
Related tags :