Business

సెప్టెంబరులో బ్యాంకు సెలవులు ఇవి-వాణిజ్యం

సెప్టెంబరులో బ్యాంకు సెలవులు ఇవి-వాణిజ్యం

* ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంక్‌కు వెళ్తున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే! బ్యాంకులు ఏయే తేదీల్లో పని చేస్తాయో తెలుసుకుంటే.. ఆ మేరకు ప్రణాళికలు వేసుకోటానికి వీలుంటుంది. లేదంటే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకారం సెప్టెంబర్‌ నెలలో ఆయా రాష్ట్రాల్లో పండుగలకు అనుగుణంగా బ్యాంకులకు 12రోజుల సెలవులు వస్తున్నాయి.తెలుగురాష్ట్రాల విషయానికొస్తే 7 రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. 5, 12, 19, 26 ఆదివారాలు కాగా, 11వ తేదీ రెండో శనివారం, 25వ తేదీ నాలుగో శనివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఈ ఆరు సెలవు దినాలు ఎప్పుడూ ఉండేవేకాగా.. సెప్టెంబర్‌ 10వ తేదీ వినాయక చవితి వచ్చింది. దీంతో  10, 11, 12 తేదీల్లో వరుసగా మూడు రోజులు బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోనున్నాయి.

* చైనాలోని అత్యున్నత ప్రజా న్యాయస్థానం కార్మికుల సంక్షేమంపై పరిశ్రమలకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. అధిక పని విషయంలో దేశంలోని అన్ని పెద్ద కార్పొరేషన్లు తమ విధానాలు మానుకోవాలని హితవుపలికింది. ఇకపై 996 ఫార్ములా (996 Formula) ప్రకారంగా నడుచుకోవాలనుకోవడం చట్టవిరుద్ధం కిందకు వస్తుందని తేల్చింది. సుప్రీంకోర్టు హెచ్చరికలను చైనా ప్రభుత్వం కూడా సమర్ధించడంతో.. అక్కడి బడా కంపెనీలో ఇరుకున పడిపోయాయి. చైనాలోని చాలా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగులతో ఎక్కువ పని చేయిస్తున్నారని, ఫలితంగా వేధింపుల కేసులు నిరంతరం పెరుగుతున్నాయని ఆ దేశ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

* గ్లోబ‌ల్ ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్‌కు వ్య‌తిరేకంగా ఫ్యూచ‌ర్ రిటైల్ మ‌ళ్లీ సుప్రీంకోర్టు త‌లుపు త‌ట్టింది. సింగ‌పూర్ అంత‌ర్జాతీయ మ‌ధ్య‌వ‌ర్తిత్వ కోర్టు అత్య‌వ‌స‌ర ఆదేశాల‌ను అమ‌లు చేస్తే సంస్థ‌లోని 35,575 మంది ఉద్యోగుల భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌కం అవుతుంద‌ని ఫ్యూచ‌ర్ గ్రూప్ అధినేత కిశోర్ బియానీ సుప్రీంకోర్టులో శ‌నివారం పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

* ప్ర‌ముఖ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ సంస్థ కార్వీలో కుంభ‌కోణం గుట్టును హైద‌రాబాద్ సీసీఎస్ పోలీసులు వెలికి తీశారు. ఈ కుంభ‌కోణం మొత్తం విలువ రూ.2700 కోట్లు అని నిగ్గు తేల్చారు. స‌కాలంలో రుణాలు చెల్లించ‌కుండా ఎగ‌వేత‌కు పాల్ప‌డిన కార్వీ చైర్మ‌న్ పార్ధ‌సార‌ధిపై బ్యాంకుల ఫిర్యాదు మేర‌కు హైద‌రాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందు రెండు రోజుల క‌స్ట‌డీ ముగిసిపోవ‌డంతో శ‌నివారం మ‌రోమారు క‌స్ట‌డీకి అప్ప‌గించాల‌ని పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈసారి రెండు రోజుల క‌స్ట‌డీకి అప్ప‌గిస్తూ నాంప‌ల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆది, సోమ‌వారాల్లో మ‌రోమారు పార్ధ‌సార‌ధిని పోలీసులు విచారిస్తారు.

* దేశవ్యాప్తంగా కొత్తగా వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రాల మధ్య వాహనాల బదిలీని సులభతరం చేసేందుకు వీలుగా ఈ కొత్త ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా కొత్త వాహనాలకు భారత్‌ సిరీస్‌ (బీహెచ్‌ సిరీస్‌) తో (Bharath Registration) రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఈ కొత్త రకం ప్రక్రియతో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగ రీత్యా బదిలీ అయ్యే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనున్నది. మరో రాష్ట్రానికి బదిలీ అయి వెళ్లగానే వారి వాహనాలకు అక్కడ మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండా చేశారు. అంటే.. బీహెచ్‌ సిరీస్‌తో రిజిస్ట్రేషన్‌ అయ్యే వాహనాలకు నేషనల్‌పర్మిట్‌ లభిస్తున్నదన్నమాట. సెంట్రల్ మోటార్ వాహనాల (20 వ సవరణ) నియమాలు, 2021, చట్టం 2021 సెప్టెంబర్ 15 నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వ నోటిఫికేషన్ తెలిపింది. బీహెచ్‌- సిరీస్ వాహనం కోసం రిజిస్ట్రేషన్‌ మార్క్‌ పోర్టల్ ద్వారా రాండమ్‌గా ఉత్పత్తి అవుతుంది.