పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీటీడీ పాలకమండలి..
తిరుమలలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతోంది.
రూ.18లక్షల విలువ చేసే ఎలక్ట్రిక్ కారును అధికారులు కొనుగోలు చేశారు.
తిరుమలలో విధులు నిర్వర్తించే అధికారులకు మొత్తం.. 35 కార్లను కేటాయించనున్నట్లు తెలిపారు.
దశల వారీగా పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు.
వీటితో పాటూ ఘాట్ రోడ్డులో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రవేశపెట్టాలని పాలకమండలి భావిస్తోంది.