DailyDose

మహిళా ఎస్సై ఆత్మహత్య-నేరవార్తలు

మహిళా ఎస్సై ఆత్మహత్య-నేరవార్తలు

* సత్తెనపల్లి పట్టణంలో ఘోరం జరిగింది. తల్లి కూతురు దారుణ హత్యకు గురయ్యారు.స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..విఆర్వోగా పనిచేసి పదవీవిరమణ చేసిన కోనూరు శివప్రసాద్ ఇటీవల మృతి చెందారు.ఆయనకు భార్య వెంకట సుగుణ పద్మావతి(57),కూతురు లక్ష్మీ ప్రత్యూష (31), ఒక కొడుకు ఉన్నారు.కొడుకు గుంటూరు ఆర్టిఓ ఆఫీస్ లో సీసీగా పని చేస్తున్నాడు.కూతురు పద్మావతికి ఇటీవల వివాహం జరిగింది.శివ ప్రసాద్ భార్య,కూతురు 10వ వార్డ్ లోని నాగార్జున నగర్ నందు నివాసం ఉంటున్నారు.శనివారం రాత్రి ఏడు గంటల ఇరవై నిముషాలకు ఇంట్లో ఉన్న తల్లి, కూతురును ఓ ఆగంతకుడు కత్తితో నరికి చంపాడని పోలీసులు పేర్కొంటున్నారు.తీవ్ర గాయాలపాలైన పద్మావతి, ప్రత్యూషలు అక్కడికక్కడే మృతి చెందారు.పట్టణ సిఐ శోభన్ బాబు, ఎస్సై రఘుపతిలు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఆస్ది తగాదాలే హత్యకు దారితీసాయని పోలీసులు అనుమానిస్తున్నారు.నిందితుడు, మృతులకు బంధువు శ్రీనివాసరావుగా సమాచారం. హత్య చేసిన కొద్ది సేపటి తరువాత నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.కాగా తల్లీ ,కూతుళ్ళు దారుణ హత్యకు గురవడం స్ధానికులను తీవ్రంగా కలచివేసింది. పట్టణంలో సంచలనం రేపింది.

* మహిళా ఎస్సై ఆత్మహత్య…సఖినేటిపల్లి మహిళా అడిషనల్ ఎస్సై కె.భవానీ విజయనగరం లో ఆత్మహత్య…వారం రోజుల క్రితం విజయనగరం జిల్లా లో పి టి సి ట్రైనింగ్ నిమిత్తం వెళ్లిన భవానీ…2018 బ్యాచ్ కి చెందిన ఎస్సై భవానీ…రాజోలు స్టేషన్ లో ట్రైనింగ్ అనంతరం సఖినేటిపల్లి పీఎస్ లో మొదటి పోస్టింగ్…అవివాహిత అయినా భవానీ స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెం పాలెం గ్రామం…..మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* గుర్తు తెలియని మహిళ మాయమాటలు చెప్పడంతో తన ప్రయణాన్ని వాయిదా వేసుకుని ఆమెతో వెళ్లి చివరకు మోసపోయిన ఘటన హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో జరిగింది. హైదరాబాద్‌ కేపీహెచ్‌బీకి చెందిన శ్రీధర్‌ ఈనెల 22న భద్రాచలం వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఉదయం కేపీహెచ్‌బీ మెట్రోస్టేషన్‌కు వెళ్లడంతో అక్కడ విజయ అనే మహిళ అతనికి మాయమాటలు చెప్పి ఒప్పించి తనతో పాటు ఆటోలో ఎల్లమ్మబండలోని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ జోగేందర్‌సింగ్‌, ముత్యలా విష్ణు …శ్రీధర్‌ను బెదిరించి ఫోన్‌, వాచ్‌, పర్సు లాక్కునేందుకు ప్రయత్నించడంతో శ్రీధర్‌ తిరగబడ్డారు. అతడిపై దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కున్నారు. అనంతరం వారి నుంచి తప్పించుకుని భద్రాచలం వెళ్లిన శ్రీధర్‌ స్నేహితుడి సాయంతో జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి పది గ్రాముల బంగారు గొలుసు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

* రైల్వే ప్లాట్‌ఫాం మీద నిల్చొని రైలు సమీపించగానే లైటర్‌తో సిగరెట్‌ వెలిగించి స్టైల్‌గా నిల్చొనే వీడియోతోపాటు.. మరో వీడియోలో రైల్వే పట్టాలమీద కూర్చొని పొగ తాగుతూ కనిపిస్తాడు. ఈరెండూ వీడియోలను ఇన్‌స్టాలో అప్‌లోడ్‌ చేయగానే. . రైల్వే నియమనిబంధనలను అతిక్రమించాడంటూ సెంట్రల్‌ రైల్వే ప్రొటెక్టివ్‌ ఫోర్స్‌ బృందాలకు ఫిర్యాదులందాయి. వెంటనే రంగంలోకి దిగిన ఐపీఎఫ్‌ బద్లాపుర్ బృందం.. అతడి బీఎండబ్ల్యూ కారు నెంబరు ఆధారంగా ట్రాక్‌ చేసి పట్టుకున్నారు. ఈసారి సెంట్రల్‌ రైల్వే ఆదర్శ్‌తో మరో వీడియో రూపొందించి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఇందులో ఆదర్శ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి వీడియో తీసినందుకు క్షమించండి. ఆనందం కోసం రైల్వే స్టైషన్‌లో కానీ రైలులో ఇలాంటి అభ్యంతర వీడియో రూపొందించకండి’’ అంటూ వేడుకున్నాడు.