మూడేళ్ల విరామం తర్వాత షారుక్ ఖాన్ నుంచి వస్తోన్న చిత్రం ‘పఠాన్’. కరోనా పరిస్థితుల కారణంగా నెమ్మదించిన ఈ సినిమా షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. ఇటీవలే దుబాయ్‌లో చిత్రీకరణ చేశారు. త్వరలో ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను యూరప్‌లో మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘పక్కాగా తేదీలు ఖరారు కాలేదు కానీ త్వరలో యూరప్‌లో ఓ షెడ్యూల్ చేయనున్నారు. అఫ్గానిస్తాన్ కూడా చిత్రీకరణ జాబితాలో ఉన్నట్టు వస్తున్న వార్తలు అబద్ధం’’అని చిత్ర వర్గాలు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని యూరప్‌లోని స్పెయిన్‌తో పాటు మాడ్రిడ్‌లో తెరకెక్కించనున్నారు. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రతినాయకుడిగా జాన్ అబ్రహం నటిస్తున్నారు.
స్పెయిన్‌లో “పఠాన్”
Related tags :