NRI-NRT

వాషింగ్టన్‌లో వేడుకగా తెలుగువారి వనభోజనాలు

వాషింగ్టన్‌లో వేడుకగా తెలుగువారి వనభోజనాలు

“గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS)” వార్షిక వనభోజన కార్యక్రమం ఘనంగా జరిగింది. 47 సంవత్సరాలుగా అమెరికా రాజధాని వేదికగా స్థానిక తెలుగువారికి సేవ చేస్తున్న ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే వార్షిక వనభోజన కార్యక్రమం ఈ ఏడాది బర్క్ లేక్ పార్క్‌లో ఏర్పాటు చేశారు. ఉల్లాసభరితంగా, చిన్నారుల కేరింతలతో, తెలుగు వారి సంప్రదాయ వంటల ఘుమఘుమలతో ఆహ్లాదకరంగా సాగింది. మహిళలకు వంటలు, వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. సంస్థ అధ్యక్షురాలు సాయి సుధా పాలడుగు మాట్లాడుతూ…తెలుగువారిని అందరని ఒక చోట చేర్చి ఎప్పటికీ ఒకరికి ఒకరం అనే విధానం పాటిస్తూ తెలుగు భాష, సంస్కృతిని ముందు తరాలకు కూడా చేరువ చేసే కార్యాచరణతో ముందుకు సాగుతామన్నారు. కార్యక్రమంలో డా.కొడాలి నరేన్, కంతేటి త్రిలోక్, మన్నే సత్యనారాయణ, మోపర్తి లక్ష్మీ, ఉప్పుటూరి రాంచౌదరి, విజయ్ గుడిసేవ, ఉప్పలపాటి అనిల్, సత్య సూరపనేని, ఫణి తాళ్లూరి, భాను మగులూరు, లాం కృష్ణ, యాష్, రవి, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు.