Movies

ఈడీ అధికారుల ఎదుట పూరీ హాజరు-నేరవార్తలు

ఈడీ అధికారుల ఎదుట పూరీ హాజరు-నేరవార్తలు

* సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) విచారణ ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ 12 మంది సినీ రంగానికి చెందిన వాళ్లకు ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలిరోజు పూరీ జగన్నాథ్‌ విచారణకు వచ్చారు. 2017లో నమోదైన కేసుల ఆధారంగా పలు కీలక విషయాలపై ఈడీ అధికారులు ఆయన్ను ఆరా తీస్తున్నట్లు సమాచారం.

* కడప నగరంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని ఓ బిందెల పరిశ్రమలో అగ్ని ప్రమాదం…షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమిక నిర్దారణ..సుమారు 8 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని రుద్రమోహన్ రెడ్డి వెల్లడి..

* గుంటూరు జిల్లా తెనాలి బస్టాండ్ సమీపంలో పేరడైజ్ అపార్ట్మెంట్ లో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు శోధించారు మంగళవారం హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ స్రవంతి రాయి వెల్లడించారు. అత్తా కోడళ్ళ మధ్య జరిగిన వాగ్వాదం లో అత్త మైథిలి నిద్రిస్తుండగా కోడలు రాధా ప్రియాంక కూరగాయలు కోసే కత్తితో పొడిచి చపాతీ కర్రతో కొట్టి చంపినది అన్నారు కోడలు రాధా ప్రియాంకను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ తో పాటు సి ఐ ఎస్సై తదితరులు పాల్గొన్నారు

* రాజ‌స్ధాన్‌లోని నాగౌర్ జిల్లాలో దారుణం జ‌రిగింది. 16 ఏండ్ల బాలిక‌పై మైన‌ర్ స‌హా ఐదుగురు వ్య‌క్తులు సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న వెలుగుచూసింది. బాలిక‌పై త‌మ పొరుగున ఉన్న యువ‌కుడు(20) ఈ అరాచ‌కానికి పాల్ప‌డ్డాడ‌ని బాధితురాలి తండ్రి పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఆగ‌స్ట్ 26న బాలిక‌కు మాయ‌మాట‌లు చెప్పి త‌న‌ ఇంటికి ర‌ప్పించిన నిందితుడు ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న మ‌రో న‌లుగ‌రితో క‌లిసి సామూహిక లైంగిక దాడికి తెగ‌బ‌డ్డాడు.

* క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులోని కోర‌మంగ‌ళ మార్స్ వెల్ఫేర్ హాల్ వ‌ద్ద మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ఓ కారు డివైడ‌ర్‌ను ఢీకొట్ట‌డంతో దాంట్లో ప్ర‌యాణిస్తున్న ఏడుగురు స్నేహితులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఫ్రంట్ సీటులో ముగ్గురు, వెనుక సీటులో మిగ‌తా న‌లుగురు కూర్చున్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు. మృతులంతా 20 నుంచి 30 ఏండ్ల లోపు వ‌య‌సున్న వారే.. క‌రుణా సాగ‌ర్‌, బిందు (28), అక్ష‌య్ గోయ‌ల్, ఇషిత (21), ధ‌నూష (21), రోహిత్‌, ఉత్స‌వ్ ఉన్నారు. క‌రుణా సాగ‌ర్‌, బిందు భార్యాభ‌ర్త‌లు. సెయింట్ జాన్స్ హాస్పిట‌ల్‌లో మృతదేహాల‌కు పోస్టుమార్టం నిర్వ‌హించారు.

* కామారెడ్డి మున్సిపాలిటీలోని బ‌ర్క‌త్‌పురా ఏరియాలో మంగ‌ళ‌వారం ఉద‌యం ఓ వివాహిత‌పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి క‌త్తితో దాడి చేసిన‌ట్లు వార్త‌లు షికారు చేసిన విష‌యం తెలిసిందే. కానీ ఏ వ్య‌క్తి కూడా ఆమెపై క‌త్తితో దాడి చేయ‌లేద‌ని, త‌న‌కు తానే బ్లేడుతో గొంతు కోసుకున్న‌ద‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. తొలుత హ‌త్యాయ‌త్నంగా చిత్రీక‌రించాల‌ని ఆమె భావించిన‌ప్ప‌టికీ.. పోలీసుల విచార‌ణ‌లో అస‌లు విష‌యం వెలుగు చూసింది.